Ads
ఇటీవల నందమూరి తారకరత్న మరణం యావత్ తెలుగు సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. సినిమాల్లో హీరోగా, విలన్ గా అలరించి.. రాజకీయాల్లోకి అడుగుపెడదామనుకుని ఊహించని విధంగా ఆయన గుండెపోటుతో మరణించడం కుటుంబీకులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. హాస్పిటల్ చేరిన ఆయన 23 రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. అయితే సినిమాల్లో అంతగా రాణించలేకపోవడం తో తారక రత్న వాటి నుంచి విరామం తీసుకొని పలు వ్యాపారాలు చేసారు.
Video Advertisement
అయితే తాజాగా ఆయన మరణించడం తో ఆయన ఆస్తుల గురించి అందరు ఆరా తీస్తున్నారు. ఆయనకు సంబంధించిన హోటల్ ను గతంలో కూల్చివేశారనే విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది. నందమూరి తారకరత్నకు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కబరా డ్రైవ్ ఇన్ పేరుతో ఒక రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ ను 2019లో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో ఈ వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది.
రెస్టారెంట్ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ కొంత భాగం కూల్చేశారట. ఈ విషయం తెలుసుకున్న తారకరత్న వెళ్లి సమస్య ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా.. రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారట. అంతేకాకుండా రెస్టారెంట్ లో లిక్కర్ కూడా సప్లయ్ చేస్తూ.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని కొందరు కంప్లయింట్ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారని సమాచారం.
దీంతో తారకరత్న అధికారులతో మాట్లాడి అక్కడి ఫర్నిచర్, మెటీరియల్ ను షిఫ్ట్ చేసేందుకు కాస్త సమయం తీసుకున్నారట. తర్వాత ఆ రెస్టారెంట్ ను వేరొక చోటుకు మార్చారు. అయితే ముందుగా చెప్పకుండా రెస్టారెంట్ కూల్చివేతకు పూనుకోవడం పై అప్పట్లో జిహెచ్ఎంసి పై ఎన్నో విమర్శలు వచ్చాయి. మరో వైపు తారకరత్న వివాహ విషయం లో కుటుంబ సభ్యులతో విబేధాలు ఉండటం తో ఆయన సొంతం గా బిజినెస్ చేసేందుకు ప్రయత్నాలు చేసారు. ఇక ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి చురుగ్గా మారారు. ఈ లోపే ఊహించని అనర్థం జరిగి తన కుటుంబానికి కన్నీటిని మిగిల్చారు.
End of Article