“రంగమ్మ మంగమ్మ” నుండి… “గుడిలో బడిలో” వరకు… అభ్యంతరాల కారణంగా “లిరిక్స్” మార్చిన 12 సూపర్ హిట్ పాటలు..!

“రంగమ్మ మంగమ్మ” నుండి… “గుడిలో బడిలో” వరకు… అభ్యంతరాల కారణంగా “లిరిక్స్” మార్చిన 12 సూపర్ హిట్ పాటలు..!

by Anudeep

Ads

సినీ ఇండస్ట్రీ లో కాంట్రవర్సిస్ అనేవి చాలా సాధారణం. అది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి వివాదాలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సినిమా టైటిల్స్ నుంచి.. పాడిన పాటల వరకు కాంట్రవర్సీలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య సినిమాల్లోని పాటలు.. వాటి లిరిక్స్ వల్ల వివాదాలు తరచుగా వస్తున్నాయి. ఈ కారణం తో పాటలు రిలీజ్ అయిన తర్వాత వాటి లిరిక్స్ ని మళ్ళీ కొత్తగా రాసి విడుదల చేస్తున్నారు.

Video Advertisement

ఈ లిస్ట్ లో ఏ ఏ పాటలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

#1 జయం – బండి బండి రైలు బండి సాంగ్

నితిన్, సదా జంటగా వచ్చిన జయం సినిమా ఎంత హిట్ అయ్యిందో మనకి తెలిసిందే. ఈ మూవీ లో సాంగ్స్ అన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే ఈ చిత్రం లోని “రైలు బండి.. రైలు బండి..” పాట లో మొదట ” రైలు బండి.. రైలు బండి.. వేళ కంటూ రాదు లెండి.. అని రాసారు. కానీ దానికి రైల్వే శాఖ అభ్యంతరం చెప్పడంతో “రైలు బండి.. రైలు బండి.. ఎంత మంచి రైలు బండి..” అని మార్చారు.

#2 ఆర్య 2 – రింగ రింగ

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 సూపర్ హిట్ అన్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సాంగ్ లో చాలా చరణాలను మార్చారు.

#3 స్వామి రారా – టైటిల్ సాంగ్

నిఖిల్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన స్వామి రారా మూవీ టైటిల్ సాంగ్ లో పల్లవిని రెండు సార్లు మార్చారు. మొదట “కృష్ణుడి వారసులంతా”.. అని ఉండేది. తర్వాత దాన్ని “కృష్ణుడికే ఇది వింత..” అని మార్చారు. ఇక ఫైనల్ గా “తస్కర తనయులు అంతా..” అని మార్చారు.

#4 గీత గోవిందం – వాట్ ద లైఫ్

విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం పబ్ సాంగ్ లిరిక్స్ ని ‘వాట్ ద వాట్ ద లైఫ్’ అని మార్చారు.

#5 చిన్నదాన నీకోసం – టైటిల్ సాంగ్

నితిన్ నటించిన చిన్నదాన నీకోసం టైటిల్ సాంగ్ లో ఒక చోట ” నీకోసం అవుతానే మోడీ..” అని వస్తుంది. దాని పై కొందరు అభ్యంతరం పెట్టడం తో ఆ ఒక్క పదానికి బీప్ వేసి ప్లే చేసారు.

#6 రంగస్థలం – రంగమ్మా..మంగమ్మా..

రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం మూవీ సూపర్ హిట్ అన్న విషయం మనకి తెల్సిందే. అయితే ఈ మూవీ లో ని “రంగమ్మా..మంగమ్మా” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యాక కొందరు లిరిక్స్ పై అభ్యతరం పెట్టారు. దీంతో “గొల్లభామ వచ్చి.. నా గోరు గిల్లుతుంటే…” అని ఉన్న వాటిని మార్చి “గోరువంక వచ్చి ..నా గోరు గిల్లుతుంటే..” గా మార్చారు.

#7 మహాత్మా – కొంత మంది సొంత పేరు

శ్రీకాంత్ హీరోగా వచ్చిన మహాత్మా మూవీ లో “కొంత మంది సొంత పేరు ..” సాంగ్ ఎంత హిట్ అయిందో మనకి తెల్సింద. అయితే దీనికి ఫస్ట్ “ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ..” అని రాసారు. దానిపై అభ్యంతరాలు రావడం తో తర్వాత లిరిక్స్ మార్చారు.

#8 అదుర్స్ – చారి సాంగ్

వి వి వినాయక్ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్. ఇందులో చారి సాంగ్ సూపర్ అయింది. అయితే అందులో ” వేర్ ఇస్ ది పంచె కట్టు.. వేర్ ఇస్ ది పిలక జుట్టు చారి..” అని వచ్చే చరణాలు అభ్యంతర కరంగా ఉండటం తో వాటిని మార్చి “వేర్ ఇస్ ది పాత బైక్.. వేర్ ఇస్ ది ఓల్డ్ లుక్ చారి..” అని మార్చారు.

#9 రాజు గాడు – రబ్బరు బుగ్గల సాంగ్

రాజ్ తరుణ్ హీరోగా నటించిన రాజుగారు మూవీ లోని “రబ్బరు బుగ్గల రాం చిలక..” సాంగ్ లో ఒక చోట జీఎస్టీ పదం రాగా.. దాన్ని మ్యూట్ చేసి సాంగ్ ని ప్లే చేసారు.

#10 ఆచార్య – శానా కష్టం

ఆచార్య మూవీలోని స్పెషల్ సాంగ్ లో ఒక చోట ” యాడెడో నిమరోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపిలు అవుతున్నారు..” అన్న లిరిక్స్ మార్చాలని వివాదం జరిగింది కానీ లిరిక్స్ ని మార్చకుండానే రిలీజ్ చేసారు.

#11 డీజే – గుడిలో బడిలో సాంగ్

అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన డీజే మూవీ లో గుడిలో బడిలో సాంగ్లో లిరిక్స్ మార్చాలని వివాదం వచ్చింది కానీ.. దర్శకుడు హరీష్ శంకర్ దానిపై వివరణ ఇవ్వడం తో ఆ సాంగ్ లో మార్పులు చెయ్యలేదు. కానీ థియేటర్ లో చూసిన తర్వాత ఆ పదాల స్థానంలో వేరే పదాలు మార్చారు.

#12 పుష్ప – ఊ అంటావా మావా

అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ లో సమంత ప్రత్ఫ్యేక గీతం చేసిన విషయం తెలిసిందే. అయితే “ఊ అంటావా మావా..” సాంగ్ వల్ల మగవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వివాదం వచ్చింది కానీ తర్వాత అది సద్దుమణిగిపోయింది.


End of Article

You may also like