మెగాస్టార్ చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ మూవీ హీరోయిన్ రచన ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ మూవీ హీరోయిన్ రచన ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

by kavitha

Ads

సిల్వర్ స్క్రీన్ పై తమ అందం, అభినయంతో ఆడియెన్స్ మనసుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్స్ లో తమదైన శైలిలో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి ఆకట్టుకుంటారు. టాలీవుడ్ లో అగ్ర హీరోలతో నటించి, హిట్స్ అందుకున్న కథానాయకలు వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

Video Advertisement

కొందరు హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి  అక్క, వదిన లాంటి పాత్రలలో  రాణిస్తున్నారు. కొందరు హీరోయిన్స్ మాత్రం వారి ఫ్యామిలీకే పరిమితమయ్యారు. అలా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన హీరోయిన్స్ లో  రచన ఒకరు. కొద్ది సమయంలోనే  తెలుగు ఆడియెన్స్ కి  చేరువ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, శ్రీకాంత్ లాంటి అగ్ర హీరోలతో నటించింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో చూద్దాం..
కోల్ కతాలో జన్మించిన రచన అసలు పేరు జుం జుం బెనర్జీ. సినిమాల్లోకి వచ్చాక తన పేరును రచనగా మార్చుకుంది. ఆమె తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, ఒడియా భాషలలో హీరోయిన్ గా చేసింది. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా రచన  తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో తెలుగులో రచనకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా ఆమె కన్యాదానం, బావగారు బాగున్నారా, పవిత్ర ప్రేమ, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.
వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం మూవీలో సంఘవి చేసిన పాత్రని, హిందీలో రచన చేసింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే రచన 2007 లో ప్రోబల్ బసు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఈ జంటకి ఒక బాబు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రచన సమహిక మధ్యమాలలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తరచుగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తోంది. ఆ ఫోటోస్ లో రచనని చూసినవారు ఆమెకి 50 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నారు. ఈ వయసులోనూ అంతే అందంతో కనిపిస్తోంది.
Also Read:KABZAA MOVIE REVIEW : కన్నడ హీరో “ఉపేంద్ర” నటించిన కబ్జ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 


End of Article

You may also like