• చిత్రం : కబ్జ
  • నటీనటులు : ఉపేంద్ర, కిచ్చా సుదీప్, డాక్టర్ శివరాజ్ కుమార్, శ్రియ శరణ్.
  • నిర్మాత : ఆర్ చంద్రు, అలంకార్ పాండియన్, ఆనంద్ పండిట్
  • దర్శకత్వం : ఆర్ చంద్రు
  • సంగీతం : రవి బస్రూర్
  • విడుదల తేదీ : 17 మార్చ్, 2023

kabzaa movie review

Video Advertisement

స్టోరీ :

ఆర్కేశ్వర (ఉపేంద్ర) ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్. తన సోదరుడి మరణం తర్వాత వారిపై పగ తీర్చుకోవడానికి కొంత మంది గుండాలతో చేతులు కలుపుతాడు. అమరాపూర్ లో ఉన్న లోకల్ రౌడీని చంపి అక్కడి వారికి ఒక రక్షకుడిగా మారుతాడు. మధుమతి (శ్రియ) వీర్ బహదూర్ అనే ఒక రాజకీయ నాయకుడి కూతురు. తన తండ్రికి ఇష్టం లేకుండానే ఆర్కేశ్వరని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.

kabzaa movie review

ఆ తర్వాత ఆర్కేశ్వర మెల్లగా నార్త్ ప్రాంతంలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. ఆ తర్వాత కథలోకి భార్గవ బక్షి (కిచ్చ సుదీప్) అనే ఒక పోలీస్ ప్రవేశిస్తాడు. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. ఆ తర్వాత జరగబోయేది ఏంటి? భార్గవ బక్షి పాత్ర ఎలా ఉండబోతోంది? ఆర్కేశ్వర అన్నని చంపింది ఎవరు? ఆర్కేశ్వర తర్వాత ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

ఈ మధ్య ప్రతి సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అవ్వడం అనేది సాధారణం అయిపోయింది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా కథలో బలం ఉన్న ప్రతి సినిమా కూడా ఆ సినిమా రూపొందించిన భాషల్లో పాటు ఇతర భాషల్లోకి కూడా విడుదల చేస్తున్నారు. ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.

kabzaa movie review

కన్నడలో స్టార్ హీరో అయిన ఉపేంద్ర నటించిన ఈ సినిమా ఇప్పుడు పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. ఉపేంద్రకి తెలుగులో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. దాంతో ఈ సినిమాకి తెలుగులో కూడా చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు కూడా అంతకు ముందు విడుదల అయిన కేజిఎఫ్, పుష్ప సినిమాల ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. సినిమా కలర్ గ్రేడింగ్ అంతా కూడా కేజీఎఫ్ సినిమాని గుర్తుచేసే లాగా ఉంటుంది.

kabzaa movie review

సినిమాలో నటించిన నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. కానీ హీరోయిన్ శ్రియ మాత్రం ఆ పాత్రకి సరిపోలేదు ఏమో అనిపిస్తారు. ఇలాంటి పాత్ర శ్రియ అంతకుముందు చాలా సినిమాల్లో చేశారు ఏమో అనిపిస్తుంది. కథపరంగా చూసుకున్నా కూడా ప్రేక్షకులకి అంత ఆసక్తికరంగా అనిపించే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

kabzaa movie review

సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి సీన్ అంతకు ముందు మనం చాలా సినిమాల్లో చూసాం కదా అనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. మరి రెండవ భాగం ఎలా ఉంటుంది అనేది తెలియదు. సుదీప్ పాత్ర రెండవ భాగంలో ఒక కీలక పాత్ర అవుతుంది అని హింట్ మాత్రం ప్రేక్షకులకి ఇచ్చారు.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ కథ
  • మరీ భారీగా అనిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

సినిమా నుండి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఏదైనా ఒక యాక్షన్ సినిమా చూద్దాం అనుకునే వారికి కబ్జ ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :