Ads
విక్టరీ వెంకటేష్ హీరోగా.. అసిన్ హీరోయిన్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఘర్షణ’. 2004 లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తమిళంలో సూర్య, జ్యోతిక లు జంటగా నటించిన ‘కాక కాక’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది ‘ఘర్షణ’. ‘ఘర్షణ’ మూవీ కోసం వెంకటేష్ మేక్ఓవర్ కూడా ఆయన అభిమానుల్ని ఆకట్టుకుంది.
Video Advertisement
సినిమాలో ఇంటెన్సిటీతో కూడుకున్న కాప్ పాత్రలో వెంకీ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది.. అలాగే అసిన్ కూడా ఈ చిత్రానికి ఒక ప్లస్ పాయింట్. అయితే వీళ్లిద్దరి కాకుండా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి గుర్తుండే మరో పాత్ర విలన్ ‘పాండా’. ఈ మూవీ లో విలన్ గా సలీమ్ బేగ్ నటించారు. ఆయన తన పాత్రలో జీవించేసారు అనే చెప్పొచ్చు. ఆ చిత్రం లోని స్క్రీన్ నేమ్ ని తన పేరుతో కలుపుకున్నారు సలీమ్ బేగ్ పాండా.
తెలుగులో జై చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఆయన వరుసగా హిట్ చిత్రాల్లో నటించారు. మొత్తం గా 25 చిత్రాల్లో నటించిన సలీం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో నటించారు. అయితే 2014 తర్వాత ఆయన ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అప్పటి నుంచి కేవలం 5 చిత్రాలే చేసారు. చివరిగా 2021 లో గోపీచంద్ హీరోగా వచ్చిన ఆరడుగుల బుల్లెట్ చిత్రం లో కనిపించారు సలీం.
మంచి నటుడిగా నిరూపించుకున్న తనకు ప్రాధాన్యత లేని పాత్రలు వస్తుండటం తో సినిమాలకు దూరం అయినట్లు సలీం వెల్లడించారు. తనకు తగిన పాత్రలు ఇస్తే రెండు రెట్లు ఎక్కువగా కష్టపడతానని ఆయన వెల్లడించారు. ఇప్పటికి అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు సలీం. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే సలీం ఎప్పటికప్పుడు తన ఫోటోలని అభిమానుల తో షేర్ చేస్తూ ఉంటారు. ఆయన తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ఆయన ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
End of Article