Ads
సీత లేని రాముడిని ..రామాయణాన్ని ఊహించగలమా? భర్త మాటకు ఎదురుచెప్పని మహా ఇల్లాలు. ఎంతో సహనశీలి.. ధైర్యవంతురాలు.. ఆత్మాభిమానం గల స్త్రీమూర్తి. ఆమె జీవితం నేటి తరం మగువలకే కాదు భవిష్యత్ తరాల వారికి ఎంతో ఆదర్శం. ఇక రామయణ కథను ఆధారంగా చేసుకుని అనేక తెలుగు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో సీత పాత్రలో నటించి మెప్పించారు కొందరు నటీమణులు.
Video Advertisement
సీతాదేవి ఆహార్యాన్ని, హావభావాల్ని ఎంతో రమ్యంగా పలికించి, నటించి మెప్పించిన ఆ తెలుగుతెర నటీమణుల్ని ఈ శ్రీరామనవమి సందర్భంగా గుర్తుచేసుకుందాం..
#1 అంజలీదేవి
తెలుగు వారికి సీత అనగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు అంజలీదేవి. ‘లవకుశ’ చిత్రం లో సీత పాత్ర ఆమెకు ఎనలేని పేరు తెచ్చింది. ఈ పాత్రలో నటనకు గాను ఆమె రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. ఇప్పటికీ శ్రీరాముడి భార్య సీత అంటే అంజలీదేవి పేరే గుర్తుకు వస్తుంది.
#2 చంద్రకళ
సీత పాత్రలో ఆకట్టుకున్న మరో నటి చంద్రకళ. చూడచక్కని రూపంతో, సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న చంద్రకళ ”సంపూర్ణరామాయణం” సినిమాలో సీత పాత్రలో నటించారు.
#3 సంగీత
తన సహజ నటనతో ఆకట్టుకొనే నటి సంగీత ‘శ్రీరామపట్టాభిషేకం’ చిత్రం లో సీతగా నటించారు.
#4 జయప్రద
గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న ఎన్నో పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయప్రద. ఆమె బాపు సినిమా “సీతాకళ్యాణం” లో సినిమాలో సీతగా నటించారు.
#5 నయనతార
అలాగే దర్శకుడు బాపు తీసిన మరో చిత్రం ‘శ్రీరామరాజ్యం’ లో సీత పాత్రలో నటించి నయనతార ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్, నంది అవార్డునుకూడా అందుకున్నారు.
#6 అర్చన
‘శ్రీరామదాసు’ చిత్రం లో నటి అర్చన సీతాదేవి గా నటించారు.
#7 లయ
‘దేవుళ్ళు’ చిత్రం లో ‘అందరి బంధువయా..’ పాటలో సీతగా కనిపించారు లయ. శ్రీకాంత్ రాముడిగా సీతగా లయ కనిపించేది కొద్దిసేపైనా ఆ పాట ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది.
#8 కృతి సనన్
ఇక లేటెస్ట్ గా రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ ”ఆదిపురుష్” రామాయణ కథ ఆధారంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో కృతిసనన్ సీతగా, ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.
End of Article