Ads
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవే ఉండదు. ప్రతి ఏడాది ఎందరో హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగు పెడతారు. అలాగే సినిమా అవకాశాల కోసం ఎదురు చూసేవారు చాలా మందే ఉంటారు. కానీ తమని తాము నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకొనేవారు చాలా తక్కువగా ఉంటారు.
Video Advertisement
టాలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. వారిలో ఎక్కువగా ముంబయికి చెందిన ముద్దుగుమ్మలు ఉంటారు. కొంత మంది ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోగా.. మరి కొందరు కొన్ని సినిమాలకే పరిమితం అయ్యి ఇండస్ట్రీ కి దూరం అయ్యారు. అలాంటి వారిలో ఒకరే సోనాలీ జోషి. ఈమె ఎన్టీఆర్ తో “సుబ్బు” చిత్రం లో నటించారు. ‘స్టూడెంట్ నెంబర్1’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండీ వచ్చిన మూవీ కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ మూవీ ప్లాప్ అయ్యింది.
ప్రముఖ దర్శకుడు రుద్ర రాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ‘సుబ్బు’ చిత్రం తర్వాత సోనాలి జోషి.. సందడే సందడి, రాంబాబు గాడి పెళ్ళాం , నాన్న నేను అబద్ధం, అభి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం తో టాలీవుడ్ కి దూరం అయ్యారు. కానీ ఈమె బాలీవుడ్ లో నటించిన చిత్రాలన్నీ ప్లాప్ కావడం తో.. అక్కడా ఇక్కడా ఛాన్స్ లు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది.
ఇక అంతేకాకుండా పలు వ్యక్తిగత కారణాల వల్ల కూడా సినీ పరిశ్రమకు దూరమైంది. ఇక ఆ తర్వాత సోనాలి జోషి ఒక మలయాళ చిత్రం లో కూడా నటించింది. ఆ చిత్రం కూడా ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ముంబై లో నివాసం ఉంటున్న సోనాలి అనేక హిందీ సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించారు. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ సినీ కెరీర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు.
తాజాగా నటి సోనాలి ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనాలి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గత ఫోటోస్.. ఇప్పుడు ఫోటోస్ చూస్తే ఆమెను గుర్తుపట్టడం మాత్రం చాలా కష్టమే.
End of Article