Ads
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రకటించడం తర్వాత అవి మొదలు పెట్టడం మధ్యలో ఆపేయడం అనేది సహజం. అందులో చాలా మంది పెద్ద హీరోల సినిమాలు కూడా ఉంటాయి. ఒక సినిమా ఆపేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ దశలో ఆగిపోతాయి.. ఇంకొన్ని షూటింగ్ కంప్లీట్ అయ్యాక విడుదల కావు.. మరికొన్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోతాయి.
Video Advertisement
ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టడం మాత్రమే వాళ్ల చేతిలో ఉంటుంది అది గుమ్మడికాయ కొట్టే వరకు వెళ్తుందా లేదా అనేది చాలా మందికి తెలీదు. ఆ విధంగా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ విధంగా చిన్న హీరోల సినిమాలే కాదు స్టార్ హీరోల సినిమాలు సైతం ఆగిపోయాయి.
ఇప్పుడు పూజా కార్యక్రమాలు ముగిసాక.. ముహూర్తం సన్నివేశం కంప్లీట్ అయ్యాక ఆగిపోయిన సినిమాలేవో చూద్దాం..
#1 చిరంజీవి – రామ్ గోపాల్ వర్మ మూవీ
అప్పట్లో రామ్ గోపాల్ వర్మ స్టార్ డైరెక్టర్, చిరు పెద్ద హీరో అలాంటిది వారి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ అనుకోకుండా ఆ చిత్రం మధ్యలో ఆగిపోయింది.
ఈ సినిమా ఆగి పోవడానికి గల కారణాలు కూడా ఇద్దరూ ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత వర్మ బాలీవుడ్ లో ఆఫర్లు ఉండటం వల్ల వదిలేసా అంటూ ఒకసారి చెప్పుకొచ్చారు.
#2 అబూ
చిరంజీవి 1999 లో అబూ బాగ్దాద్ గజదొంగ అనే మూవీ చేసారు. ఇది హాలీవుడ్ సినిమా. ఈ సినిమాకి ఇంగ్లీషులో ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టారు. ఈ సినిమా కి ల్ ఆడమ్స్, రమేష్ కే సుందర్ స్వామి నిర్మాతలు. ఈ మూవీ కి ఇంగ్లీష్ వర్షన్ కి డోచెన్ గెర్సీ, తెలుగు వెర్షన్ కి సురేష్ కృష్ణ గారు దర్శకత్వం వహించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.
#3 విక్రమ్ సింహ భూపతి
20 సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయగా హీరోయిన్స్ గా రోజా, అంజలి జవేరి నటించారు.
ఎస్ గోపాల్ రెడ్డి అప్పట్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. భారీ సెట్టింగ్స్ వేసి ఈ సినిమాని నిర్మించారు. కానీ బాలయ్యకు కోడి రామకృష్ణకు మధ్య విభేదాలు రావడంతో కోడి రామకృష్ణ ను తీసేస్తే సినిమా చేస్తానని లేదంటే చేయనని చెప్పాడట. దీంతో అలా సినిమా మధ్యలో ఆగిపోయింది.
#4 నర్తనశాల
నందమూరి తారక రామారావు నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నర్తనశాల ఒకటి. ఈ సినిమా అంటే ఎంతో బాలయ్య కు కూడా ఇష్టం. అందుకే ఇప్పటి జనరేషన్ కు తెలియజేసేందుకు ఈ సినిమాను సొంత దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారు.
2004లో మార్చి 1న ఈ సినిమాను ప్రారంభించారు. సౌందర్య, శరత్ బాబు, శ్రీహరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే సౌందర్య దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించడంతో ఈ సినిమా ఆగిపోయింది.
#5 ఆటా నాదే… వేట నాదే
వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రకటించారు. కానీ ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
#6 నాన్ రుద్రన్
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో ధనుష్ దర్శకత్వంలో నాన్ రుద్రన్ అనే ఒక మల్టీ స్టారర్ సినిమా స్టార్ట్ అయింది. షూటింగ్ కూడా మొదలై ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. కానీ ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది.
#7 జీసస్ క్రైస్ట్
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సినిమా షూటింగ్ కోసం ఇజ్రాయిల్ కూడా అప్పట్లో వెళ్లారు. కానీ మధ్యలోనే ఆగిపోయింది.
#8 సీనయ్య
వి.వి.వినాయక్ హీరోగా ‘శరభ’ దర్శకుడు ఎన్.నరసింహ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
#9 హీరో
విజయ్ దేవరకొండ హీరోగా , మాళవిక మోహనం హీరోయిన్ గా హీరో సినిమా మొదలైంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసిన ఫస్ట్ షెడ్యూల్ అవుట్ ఫుట్ ఆశించిన స్థాయిలో రాకపోవడం తో మైత్రీ మూవీ మేకర్స్ తప్పుకొన్నారని సమాచారం. దీంతో ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
#10 జనగణమన
‘లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మొదలైన సినిమా ఇది. పూరి డ్రీం ప్రాజెక్టు కూడా. అయితే లైగర్ చిత్రం ప్లాప్ కావడం తో ఈ చిత్రం షూటింగ్ అలా మొదలైందో లేదో వెంటనే ఆగిపోయింది.
#11 కోతి కొమ్మచ్చి
‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ చిత్రం శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి, సతీష్ వేగేశ్న కొడుకు సమీర్ వేగేశ్న హీరోలుగా నటించారు.
#12 రామ్ – ప్రవీణ్ సత్తార్ మూవీ
రామ్ – ప్రవీణ్ సత్తార్ క్రేజీ కాంబినేషన్లో కూడా సినిమా మొదలైంది. విదేశాల్లో పలు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసారు. కానీ షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే ప్రాజెక్ట్ ఆగిపోయింది.
#13 డి అండ్ డి – డబుల్ డోస్
శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా మొదలైన ఈ మూవీ .. షూటింగ్ ఆరంభంలోనే ఆగిపోయింది.
#14 పవర్ పేట
‘ఛల్ మోహన్ రంగ’ తర్వాత నితిన్ – కృష్ణ చైతన్య కాంబినేషన్లో పవర్ పేట మూవీ రావాల్సి ఉంది. ఆ ప్రాజెక్టుని తమ సొంత బ్యానర్ పై నిర్మించబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ బడ్జెట్ కారణాలతో ఈ మూవీ ఆగిపోయింది.
#15 విశ్వక్ సేన్ – అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం లో.. ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా.. విశ్వక్ సేన్ హీరో గా ఒక మూవీ స్టార్ట్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశం తర్వాత షూటింగ్ మొదలవ్వడం కొన్ని సీన్స్ తీసినా అవి విశ్వక్ సేన్ కు నచ్చకపోవడం. తర్వాత అర్జున్ కి కోపం వచ్చి విశ్వక్ సేన్ ను తీసేయడం జరిగింది.
#16 2 స్టేట్స్
అడివి శేష్ హీరోగా శివాని రాజశేఖర్ మొదటి సినిమాగా ఈ మూవీ షూటింగ్ మొదలైంది. వెంకట్ రెడ్డి దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
#17 అహం బ్రహ్మాస్మి
మనోజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా మొదలైన ఈ చిత్రం షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది.
#18 సూర్య – బాల మూవీ
ఈ క్రేజీ కాంబినేషన్లో కూడా మూవీ మొదలైంది. షూటింగ్ జరుపుకుంటున్న టైంలో సడన్ గా ఈ ప్రాజెక్టు నుండి సూర్య తప్పుకోవడం తో ఈ మూవీ ఆగిపోయింది.
End of Article