Ads
గుజరాత్ టైటాన్స్ కి, కోల్కతా నైట్రైడర్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ బౌలర్ యష్ దయాల్ బౌలింగ్ లో కోల్కతా నైట్రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతులని సిక్సర్లుగా కొట్టి ఆ జట్టుకి విజయాన్ని అందించారు. ఈ విషయం జరిగి దాదాపు మూడు రోజులు అవుతోంది.
Video Advertisement
ఆ తర్వాత ఇంకో రెండు మ్యాచ్ లు కూడా అయ్యాయి. ఈ సంఘటనని అందరూ మర్చిపోయి కూడా ఉంటారు. ఇలాంటి సంఘటనలు అంతకు ముందు కూడా క్రికెట్ లో చాలా జరిగాయి. ఏది ఏమైనా సరే ఒక క్రీడలో ఇలాంటివి జరగడం సహజం. కాబట్టి చూసే ప్రేక్షకులు కూడా వీటి గురించి ఒక రోజు మాట్లాడుకుంటారు. కానీ ఆ తర్వాత మర్చిపోతారు.
కానీ యష్ దయాల్ తల్లి రాధా మాత్రం మూడు రోజులు గడిచినా కూడా ఈ సంఘటనని మర్చిపోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు. తన కొడుకు కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి సంఘటన ఎదురవడం చాలా బాధాకరమైన విషయం అని, రాధా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని యష్ దయాల్ తండ్రి చంద్రపాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తన కొడుకు ఎదుర్కొన్న ఈ అనుభవం గురించి మాట్లాడుతూ చంద్రపాల్ కూడా బాధపడ్డారు.
“క్రికెట్ లో ఇలాంటివి అవ్వడం సహజమే కానీ మన వరకు వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేకపోతున్నాము” అని చెప్పారు. ఆమె ఇప్పటికీ అదే తలుచుకుంటూ ఏడుస్తున్నారు అని, కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చాలి అని ప్రయత్నించినా కూడా ఆవిడ వినట్లేదు అని చెప్పారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఆవిడ బాధపడుతూ అన్నం కూడా తినట్లేదు అని అన్నారు. ఎవరు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా ఆవిడ అదే తలుచుకుంటూ చాలా బాధపడుతున్నారు అని చంద్రపాల్ తెలిపారు.
అది ఒక కాలరాత్రి అని, ఆ రోజు జరిగిన సంఘటనని తమ జీవితంలో ఎప్పుడూ మర్చిపోము అని అన్నారు. ఇలాంటి సమయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అలాగే మిగిలిన ప్లేయర్స్ యష్ దయాల్ కి ధైర్యాన్ని అందించడం గురించి చంద్రపాల్ మాట్లాడారు. యష్ దయాల్ ని ఆ బాధలో నుండి బయటికి తీసుకురావడానికి జట్టు మేనేజ్మెంట్ పాటలు డాన్స్ ప్రోగ్రామ్ వంటివి కూడా ఏర్పాటు చేశారు అని చెప్పారు.
watch video :
"Because he's the Knight #KKR deserves and the one they need right now" – Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX
— JioCinema (@JioCinema) April 9, 2023
End of Article