Ads
రాకింగ్ స్టార్ యశ్ నటించిన KGF చాప్టర్ 2 ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కన్నడలో మాత్రమే కాకుండా దేశమంతటా పెద్ద విజయం సాధించి ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేసింది KGF 2 సినిమా.
Video Advertisement
సినిమా కథకు, సినిమాలోని ఎలివేషన్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. మరో వైపు ప్రశాంత్ నీల్ స్టార్ హీరోలతో వరుస చిత్రాలు ప్లాన్ చేసాడు. అయితే KGF 2 సినిమా గత సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా వచ్చి నేటికి సంవత్సరం పూర్తయింది.
ఈ నేపథ్యం లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ విడుదల చేసింది. రాకీస్ మాన్‌స్టర్ కట్ పేరుతో విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో KGF చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నింటినీ మేళవించారు. ఈ వీడియో చూస్తే సినిమా చూసినంత కిక్ వస్తోంది.
భువన గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సౌండ్ డిజైన్, ప్రశాంత్ నీల్ టేకింగ్.. అన్నింటికీ మించి యశ్ స్క్రీన్ ప్రెజన్స్ ఈ ఒక్క వీడియోలో కనిపిస్తుంది. ఇక KGF 2 సినిమా చివర్లోనే దీనికి కూడా సీక్వెల్ ఉంటుందని KGF 3 హింట్ ఇచ్చి వదిలేశారు. దీంతో యశ్ అభిమానులు, ఈ సినిమా అభిమానులు KGF 3 ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.
ఈ వీడియోలో 1971 నుంచి 1981 వరకు రాఖీ భాయ్ ఏమైపోయాడు అనే ప్రశ్న వేసి, చివర్లో రాఖీ భాయ్ ప్రామిస్ ఇచ్చాడు, ప్రామిస్ తీరుస్తాడు అని KGF 2 సినిమాలోని చివరి సీన్ KGF 3 అని చూపించే షాట్ వేసి 3 అని వేశారు. అంతేకాకుండా సినిమాలో ఉన్న షాట్స్ అన్ని మామూలుగానే చూపించి, క్లైమాక్స్ మాత్రం రివర్స్ ఆర్డర్ లో చూపించారు. అంటే సినిమాలో మనకి చెప్పిన క్లైమాక్స్ నిజం కాదు అని చెప్తున్నారు అని అంటున్నారు. అలాగే బిగ్గెస్ట్ కొలిజన్ అని అంటున్నారు. అంటే ప్రభాస్ సలార్ చిత్రానికి, KGF 3 కి లింక్ ఉంటుందని ఫాన్స్ అనుకుంటున్నారు.
ఇప్పటికే సలార్ పోస్టర్స్ లో ఆ హింట్ ఇచ్చేసారు.. ఇక ఆ అద్భుతం కోసం వెయిట్ చెయ్యాలి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే హోంబలే ఫిలింస్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఆ తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ లైన్ లో ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే KGF 3 ఇప్పట్లో వచ్చేట్టుగా కనిపించట్లేదు.
watch video :
End of Article