అలనాటి నటి “పూనమ్ థిల్లాన్” గుర్తున్నారా..?? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..??

అలనాటి నటి “పూనమ్ థిల్లాన్” గుర్తున్నారా..?? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..??

by Anudeep

Ads

బాలీవుడ్ నటి పూనమ్ థిల్లాన్ గురించి మనకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె కొంతకాలం పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. 1977 లో ఫెమినా మిస్ ఇండియా, 1978 లో ఆమె మిస్ యంగ్ ఇండియా గా గెలుపొందడం తో ఆమె అందరి దృష్టిలో పడ్డారు. అప్పుడు ఆమెకు త్రిశూల్ మూవీ లో అవకాశం ఇచ్చారు యశ్ చోప్రా.

Video Advertisement

 

 

ఆ తర్వాత నూరీ (1979)లో ఆమెకు టైటిల్ రోల్ ఇచ్చారు యశ్ చోప్రా. అలా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన పూనమ్ థిల్లాన్ హిందీలో 100కు పైగా సినిమాలు చేసింది. బెంగాలీలో న్యాయ దండా, కన్నడలో యుద్ధ కాండ మరియు తెలుగులో ఇష్టం చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న పూనమ్ 2009 లో కలర్స్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు. ఆ షో లో ఆమె రన్నరప్ గా నిలిచారు.

did you remeber veteran actress poonam dhillan..!!

ఆ తర్వాత పూనమ్ పలు హిందీ సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈమె అడపా దడపా చిత్రాలు చేస్తున్నారు. పలు వెబ్ సిరీస్ లలో కూడా ఆమె నటించారు. పూనమ్ థిల్లాన్ నిర్మాత అశోక్ తాకేరియా ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పూనమ్ ఆ తర్వాత వ్యాపార రంగం లో కూడా అడుగుపెట్టారు. ‘వానిటీ’ అనే మేక్ అప్ వాన్ కంపెనీ ని ఆమె నడుపుతోంది.

did you remeber veteran actress poonam dhillan..!!

ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన పూనమ్ ప్రస్తుతం ఎక్కువగా సీనియాల్లో నటించట్లేదు. పూనమ్ ఇటీవల కామెడీ చిత్రం మమ్మీ ది జైలో కనిపించింది. ఆమె గత కొంతకాలంగా టీవీ షోలలో కూడా పని చేస్తోంది మరియు ఇటీవల దిల్ హాయ్ తో హైలో కనిపించింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన అధికారిక సంస్థ అయిన ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు నలుగురు సభ్యులలో ఒకరిగా ధిల్లాన్ నియమితులయ్యారు .

did you remeber veteran actress poonam dhillan..!!
ఇక సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే పూనమ్ ఎప్పటి కప్పుడు తన ఫోటోలు, కుటుంబ సభ్యుల ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. ఆ ఫోటోలని చూసిన పూనమ్ థిల్లాన్ అభిమానులు ఆమెలో గ్రేస్ ఇంకా తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like