“చిరంజీవిలా ఉండటమే నాకు మైనస్ అయ్యింది..”: నటుడు రాజ్ కుమార్

“చిరంజీవిలా ఉండటమే నాకు మైనస్ అయ్యింది..”: నటుడు రాజ్ కుమార్

by Anudeep

Ads

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో అన్నారాయన. ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించి నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు రాజ్ కుమార్. అయితే ఆయనకు మరో పేరు కూడా అదే ‘జూనియర్ చిరంజీవి’.

Video Advertisement

 

అప్పట్లో ఆయన చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి లా ఉండటం తో ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. కెరియర్ మొదట్లో వరుసగా వెండితెరపై అవకాశాలను అందుకున్నారు రాజ్ కుమార్. ‘అమ్మ రాజీనామా’ సినిమాతో రాజ్ కుమార్‌ని హీరోగా పరిచయం చేశారు దాసరి. ‘నాగబాల, సంసారాల మెకానిక్’, కాలేజీ బుల్లోడు’ ఇలా.. వరుసగా పది సినిమాలు చేసి బిజీ యాక్టర్ అయ్యారు.

actor raj kumar latest interview..!!

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లో క్రమంగా అక్కడ అవకాశాలు తగ్గడం తో బుల్లితెరపై మెరిశారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ” నా కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న సమయం లో నేను చిరంజీవిలా ఉన్నానంటూ కామెంట్స్ రావడం మొదలైంది. ఇక నేను ఏం చేసినా చిరంజీవిలాగే కనిపిస్తుంది. మాట్లాడటానికి బాగుంటుంది కానీ.. కెరియర్ పరంగా కలిసిరాలేదు.

actor raj kumar latest interview..!!

నేను శ్రీకాంత్, విక్రమ్, అజిత్, ఆనంద్ ఇలా ఏడెనిమిది మంది హీరోలంతా ఒకటే టైంలో వచ్చాం. అందరి కంటే నేను ముందు నా కెరియర్ స్టార్ట్ అయ్యింది. హిట్స్ కూడా వచ్చాయి. కానీ నాకు బ్రేక్ పడిపోయింది. వాళ్లు నన్ను దాటి వెళ్లిపోయారు. చిరంజీవి గారిలా కనిపించకూడదు అని ఎన్నో ప్రయత్నాలు చేశా కానీ ఫలించలేదు. అందుకే తెలుగు ఇండస్ట్రీ వదిలి కర్ణాటక వెళ్లిపోయా. కానీ అక్కడా అదృష్టం కలిసి రాలేదు. కానీ చిరంజీవి గారు వ్యక్తిగతం గా నన్ను ప్రోత్సహించేవారు. ఇక ప్రస్తుతం సీరియల్స్ తో బిజీ గా ఉన్నా..”. అని రాజ్ కుమార్ వెల్లడించారు.

actor raj kumar latest interview..!!

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మొత్తం గా 74 సినిమాలు చేసారు రాజ్ కుమార్. అందులో చాలా వరకు హీరోగానే చేసారు. ఇక ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్నా.. తొలిసారి ఆయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇందులో తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు రాజ్ కుమార్.


End of Article

You may also like