“సంపంగి” సినిమా హీరో గుర్తున్నాడా..? ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

“సంపంగి” సినిమా హీరో గుర్తున్నాడా..? ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

by kavitha

Ads

ప్రేమ కథ చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తూనే ఉంటారు. ప్రేమ కథలతో వచ్చిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకునే జాబితాలో ‘సంపంగి’ సినిమా కూడా ఉంటుంది. 22 సంవత్సరాల క్రితం, 2001లో విడుదలైన ‘సంపంగి’ మూవీ చాలా మందికి ఇప్పటీకి గుర్తుండే ఉంటుంది.

Video Advertisement

ఒక ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి ప్రేమించుకుంటే ఎలా అనే కాన్సెప్ట్ కు ఫ్యామిలీ ఎమోషన్స్ కు జత చేసి  దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ అప్పటి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన దీపక్ ప్రస్తుతం ఎలా ఉన్నాడో? ఏం చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..
సంపంగి మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సనా యాదిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం ద్వారా దీపక్ బజ్వా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు. ఈ మూవీ విజయం సాధించింది. దాంతో దీపక్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. ని తోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్, కనులు మూసినా నీవాయే వంటి చిత్రాలలో నటించి, తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఆ తరువాత హీరోగా అవకాశాలు తగ్గడంతో ‘భద్ర’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అలా దీపక్ అరుంధతి, మిత్రుడు, కింగ్, లాంటి పెద్ద సినిమాలలో నటించారు. డిల్లీలో పుట్టి పెరిగిన దీపక్, అతని అసలు పేరు అర్జన్ బజ్వా. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా గుర్తింపు పొందాడు. వివిధ ప్రకటనలో పెద్ద స్టార్స్ తో కలిసి నటించాడు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళిన దీపక్ గురు, ఫ్యాషన్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.
వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో నటుడుగా రాణిస్తున్నారు. ఆ మధ్యన వచ్చిన దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ మూవీ బిగిల్ లో కనిపించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. దీపక్ మొదటి సినిమా ‘సంపంగి’ వచ్చి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతున్నప్పటికి అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అప్పటి లాగే ఫిట్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపక్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటాడు.

https://www.instagram.com/p/CgW2-IQBw3F/?hl=en

Also Read:“విరూపాక్ష” సినిమాలో హీరోయిన్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన… అమ్మాయి ఎవరో తెలుసా..?


End of Article

You may also like