“విరూపాక్ష” సినిమాలో హీరోయిన్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన… అమ్మాయి ఎవరో తెలుసా..?

“విరూపాక్ష” సినిమాలో హీరోయిన్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన… అమ్మాయి ఎవరో తెలుసా..?

by kavitha

Ads

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. యాక్సిడెంట్ తరవాత సాయిధరమ్ తేజ్ నటించిన మొదటి చిత్రం కావడంతో ‘విరూపాక్ష’పై మెగా ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది.

Video Advertisement

ఈ మూవీకి టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే ఇవ్వడం, ఈ మూవీ నిర్మించడంలో కూడా ఆయన పార్టనర్ కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ విషయంలో ‘విరూపాక్ష’ వంద శాతం సక్సెస్ అయ్యింది.
ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దండు మొదటిసారి దర్శకత్వం వహించి విజయం సాధించారు. ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.21 కోట్లు వసూల్ చేసింది. ‘విరూపాక్ష’ ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.22 కోట్లు చేసింది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చాలా దగ్గరగా ఉంది. ఈ మూవీ హీరోయిన్ సంయుక్త మీనన్ తెలుగులో వరుసగా హిట్లతో ముందుకెళ్తోంది. ఇక విరూపాక్షతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
విరూపాక్ష మూవీ స్టోరీ పర్వత ప్రాంతంలోని రుద్రవనం అనే ఊరి నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్  ఆటిట్యూడ్‌ కలిగిన ‘నందినీ’ అనే పల్లెటూరి అమ్మాయిగా నటించింది. గ్రామంలో పుట్టి పెరిగిన నందిని చాలా ఎనర్జిటిక్ ఉంటుంది. ఈ పాత్రలో సంయుక్త మీనన్ తన నటనతో మరోసారి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ పేరు హరిణి రావు. తన గాత్రంతో హీరోయిన్ పాత్రకు మరింత అందాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఆమె ఈ చిత్రానికి ముందు ‘అవతార్ 2’ చిత్రంలో కిరి అనే పాత్రకి డబ్బింగ్ చెప్పింది. అలాగే అక్షయ్ కుమార్ నటించిన ‘రామసేతు’ చిత్రానికి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ చిత్రంలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హరిణి రావు తెలుగు వర్షెన్ కి డబ్బింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతర’ తెలుగు వర్షెన్ లో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పారు. హరిణి రావు ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని  చేస్తున్నారు. ఆమె అక్కడ వర్క్ చేస్తూనే టాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

https://www.instagram.com/p/CktdjdXgeoV/

Also Read: రాజేంద్ర ప్రసాద్ “కాష్మోరా” నుండి… సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” వరకు… తెలుగులో వచ్చిన 12 “బెస్ట్ హారర్” సినిమాలు..!


End of Article

You may also like