GEETHA SUBRAMANYAM SEASON -3 REVIEW : “గీతా సుబ్రహ్మణ్యం-3” వెబ్ సిరీస్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

GEETHA SUBRAMANYAM SEASON -3 REVIEW : “గీతా సుబ్రహ్మణ్యం-3” వెబ్ సిరీస్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Anudeep

Ads

  • వెబ్ సిరీస్ : గీతా సుబ్రహ్మణ్యం
  • నటీనటులు : అభిజ్ఞ్య ఉతలూరు, సుప్రజ్‌ రంగా
  • నిర్మాత : టమడ మీడియా
  • దర్శకత్వం : శివ సాయి వర్థన్‌
  • ఓటీటీ వేదిక : ఆహా
  • ఎపిసోడ్స్ : 8
  • విడుదల తేదీ: మే 5 , 2023
    Geetha subramanyam web series -story-review-rating

స్టోరీ:

Video Advertisement

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్‌ కంపెనీలో ఓ ప్రాజెక్ట్ నిమిత్తం గీతా(అభిజ్ఞ్య), సుబ్రమణ్యం(సుప్రజ్‌) జాబ్‌లో చేరతారు. వీరికి పురుష్‌ టీమ్‌ లీడర్‌. అయితే ఈ కంపెనీలో ఎంప్లాయిస్‌ లవ్‌లో పడకూడదు, రిలేషన్ షిప్స్ పెట్టుకోకూడదనే రూల్‌ ఉంది. అయితే ఈ కండీషన్‌ను గీతా, సుబ్బు బ్రేక్‌ చేస్తారు.

Geetha subramanyam web series -story-review-rating

అలాగే ఈ జంట మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, మరోవైపు ఆఫీస్‌లో ఓ లవ్‌ పెయిర్‌ ఉందనే సమాచారం టీమ్‌కి అందుతుంది. మరి దీన్ని ఈ ఇద్దరు ఎలా మ్యానేజ్‌ చేశాడు? తమ లివింగ్‌ రిలేషన్‌షిప్‌ ఒప్పుకున్నారా? అనంతరం ఏం జరిగిందినేది ఈ వెబ్‌ సిరీస్‌ మిగిలిన స్టోరీ.

రివ్యూ:

‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అయిన ‘గీతా సుబ్రహ్మణ్యం’ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చక్కటి ప్రేమకథగా మెప్పించింది. వెబ్ సిరీస్ లు అంటే బోల్డ్ నెస్‌ కంటెంట్‌ ఉంటుంది అనేది నిజం కాదని నిరూపిస్తూ చాలా క్లీన్‌గా రూపొందించారు. ఎలాంటి డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లకు ఛాన్స్ లేకుండా దీన్ని రూపొందించారు. పైగా గత రెండు సీజన్ల కంటే క్వాలిటీగానూ తెరకెక్కించారు.

Geetha subramanyam web series -story-review-rating

వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచే గీతా, సుబ్రమణ్యంల జర్నీని చూపించారు. వాళ్లు పైకి యాక్ట్ చేస్తూ, ఇంట్లో ఘాటు ప్రేమలో మునిగిపోవడం వంటి సీన్లని చాలా బాగా డిజైన్‌ చేశారు దర్శకుడు శివ సాయి వర్థన్‌. నేటి సిటీ కల్చర్‌ లివింగ్‌ రిలేషన్ షిప్స్ ని కళ్లకి కట్టినట్టు చూపించారు. వారిద్దరి చిన్న చిన్న గొడవలు, మనస్పర్థాలను చూపిస్తూనే అందులోనే వారి స్వచ్ఛమైన ప్రేమని ఆవిష్కరించారు.

Geetha subramanyam web series -story-review-rating

క్లైమాక్స్ మాత్రం పీక్‌కి తీసుకెళ్లారు. అక్కడ తమ లవ్‌ని ఎక్స్ ప్రెస్‌ చేసుకుంటూ ఆడియెన్స్ గుండెల్ని బరువెక్కించారు. ఎమోషన్స్ మేళవింపుగా సాగే లవ్‌ ఫీల్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ఒక హై ఫీల్‌తో ముగింపు పలకడం బాగుంది. అయితే కాస్త వినోదం తగ్గినట్టు అనిపిస్తుంది. గీతగా అభిజ్ఞ్య, సుబ్రమణ్యంగా సుప్రజ్‌ చాలా బాగా చేశారు. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. చిన్న చిన్న ఎమోషన్స్ ని, ఎక్స్ ప్రెషన్స్ ని సైతం చాలా బాగా పలికించారు.

 

పవన్‌ మ్యూజిక్‌, వినయ్‌ ఎడిటింగ్‌, శ్రీధర్‌ కేవీ కెమెరా వర్క్, టమడ మీడియా నిర్మాణ విలువలు, దర్శకుడి టేకింగ్‌ ఇలా అన్నీ బ్రిలియంట్‌.

ప్లస్ పాయింట్స్:

  • ప్రధాన పాత్రల నటన
  • క్లైమాక్స్

Geetha subramanyam web series -story-review-rating

మైనస్ పాయింట్స్ :

  • డైలాగ్ డెలివరీ
  • కామెడీ మిస్ అవ్వడం
  • సాగదీసినట్టు ఉండే కొన్ని సన్నివేశాలు

రేటింగ్ : 

3 /5

Geetha subramanyam web series -story-review-rating

టాగ్ లైన్ : 

క్వాలిటీ కంటెంట్‌తో కూడిన మెచ్యూర్డ్ వెబ్‌ సిరీస్‌..

watch trailer :


End of Article

You may also like