నుదుట ‘బొట్టు’ పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..??

నుదుట ‘బొట్టు’ పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..??

by Anudeep

Ads

బొట్టు పెట్టుకోవడం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా, చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు నుదుటన బొట్టు లేకుంటే అరిష్టంగా భావించేవాళ్ళు నేటికీ ఉన్నారు .

Video Advertisement

 

 

ముఖ్యంగా వివాహితలైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏ మాత్రం మంచిది కాదని చెప్తారు. అయితే మహిళలు నుదుట కుంకుమ తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఆడవారే కాదు.. మగవాళ్ళు కూడా ఏదైనా బొట్టుని పెట్టుకోవచ్చు.

uses of wearing bindi..!!

బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని అజ్ఞా చక్రం అంటారు. ఆజ్ఞా చక్రం మానవ శరీరం ఆరవ, అత్యంత శక్తివంతమైన చక్రంగా పరిగణిస్తారు. ఈ మూలకాన్ని రోజులో చాలాసార్లు నొక్కడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనం సూచించినప్పుడు ఆ స్థలం ప్రెస్ అవుతుంది. ఇది తల, కళ్ళు, మెదడు, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపితం చేస్తుంది. రోజుకు చాలా సార్లు బొట్టు ప్రదేశంలో ప్రెస్‌ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు.

uses of wearing bindi..!!

నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది. తలనొప్పి తగ్గిపోతుంది. సైనస్ సమస్య తొలగిపోతుంది. దృష్టి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా ఉంటుంది. డిప్రెషన్ నుండి దూరంగా ఉంచుతుంది. వినికిడి మెరుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మైగ్రేన్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

uses of wearing bindi..!!

ఇక అలాగే నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేక క్రతువులు చేసేటప్పుడు తప్పనిసరి. పుణ్యస్నానాలు చేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు, దేవతార్చన నిర్వహిస్తున్నప్పుడు, పితృ కర్మలను ఆచరించే టప్పుడు నుదుటన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. నుదుటన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు ఏమి చేసినా అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు.

uses of wearing bindi..!!

ఇదిలా ఉంటే ఇక బొట్టు పెట్టుకోవడంలో కూడా అనేక విధానాలు ఉంటాయి. ఏ వేలితో బొట్టు పెట్టుకోవచ్చు? ఏ వేలితో బొట్టు పెట్టుకోరాదు? అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి. అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అని శాస్త్రం చెబుతోంది.


End of Article

You may also like