“మహేష్ బాబు” తో పాటు… సినిమా “ఫ్లాప్” అవ్వడంతో క్షమాపణలు కోరిన 9 హీరోస్..!

“మహేష్ బాబు” తో పాటు… సినిమా “ఫ్లాప్” అవ్వడంతో క్షమాపణలు కోరిన 9 హీరోస్..!

by kavitha

Ads

ఇటీవల కాలంలో ఫలితంతో సంబంధం లేకుండా మూవీ రిలీజ్ అయిన రోజు సాయంత్రం సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడం. మూవీ ప్లాప్ అయితే బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తోంది.

Video Advertisement

ఇటీవల భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ మరియు హీరో ప్రేక్షకులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. గతంలో కూడా కొందరు హీరోలు సినిమా ప్లాప్ అయిన తరువాత క్షమాపణలు చెప్పారు. అయితే ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. మహేష్ బాబు: 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు సినిమాలు 2014లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచాయి. వీటి తరువాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమాలో నటించారు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. 2. రామ్ చరణ్: 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. ఈ మూవీ భారీ అంచనాల మధ్య 2019 జనవరి 11 న రిలీజ్ అయ్యి, డిజాస్టర్ గా నిలిచింది. రామ్ చరణ్ మూవీ పరాజయాన్ని అంగీకరిస్తూ, క్షమాపణలు కోరుతూ ఫ్యాన్స్ కు బహిరంగ లేఖ రాశారు.
3. వరుణ్ తేజ్:

వరుణ్ తేజ్ నటించిన ‘ఘని’ మూవీ 2022 లో ఏప్రిల్ 8న విడుదల అయ్యింది. అయితే, ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.  వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ఘనీ ప్లాప్ ను అంగీకరించాడు. కష్టపడి పనిచేస్తానని, భవిష్యత్తులోనూ ప్రేక్షకులను అలరిస్తానని హామీ ఇచ్చారు.
4. మెగాస్టార్ చిరంజీవి: 

కొరటాల దర్శకత్వంలో  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య. ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ప్లాప్ పై చిరంజీవి పలుమార్లు బహిరంగంగా స్పందించారు.
5. అఖిల్ అక్కినేని: 

అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి,  భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ ఫలితం పై నిర్మాత స్పందించారు. తాజాగా హీరో అఖిల్ అక్కినేని క్షమాపణలు చెప్పక పోయిన మూవీ రిజల్ట్ ను అంగీకరిస్తూ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ కు థాంక్స్ చెప్తూ వివరణ ఇచ్చాడు.
6. అక్షయ్ కుమార్:

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిత్రాలు కొన్ని నెలలుగా ప్లాప్ గా నిలిచాయి. ఈ క్రమంలో సినిమా హిట్‌ అవ్వడం లేదంటే అది నా తప్పే అని ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు.
7. షారుఖ్ ఖాన్:

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజల్. ఇంతియాజ్ అలీ ఈ చిత్రానికి దర్శకతవం వహించారు. సినిమా ప్లాప్ అవడంతో షారుక్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పాడు.
8. ముస్తఫా బర్మావాలా:

ముస్తఫా బర్మావాలా నటించిన తొలి మూవీ మెషిన్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫెయిల్ అయినప్పుడు ముస్తఫా క్షమాపణలు చెప్పాడు.
9. అమీర్ ఖాన్:భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, ఘోర పరాజయం పాలైంది. దీంతో అమీర్ ఖాన్ అభిమానులకి క్షమాపణలు చెప్పారు.

Also Read: “నా తల్లి పడిన నరకయాతన ఏ తల్లి పడకూడదు..!” అంటూ… జబర్దస్త్‌ “సౌమ్యా రావు” ఎమోషనల్ పోస్ట్..!”


End of Article

You may also like