‘జబర్దస్త్’ కామెడీ షో యాంకర్ సౌమ్యారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా మారక ముందు సౌమ్యా రావు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Video Advertisement

ఆ తర్వాత సౌమ్యా రావు అనుకోకుండా యాంకర్ గా ‘జబర్దస్త్’ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు అంతగా తెలుగు రాకపోయినా తన తెలుగుతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. కంటెస్టెంట్ల మీద పంచులు వేస్తూ, నవ్విస్తూ ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా సౌమ్యా రావు తన తల్లి గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..సీరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకున్న సౌమ్యా రావు, అనుకోకుండా ‘జబర్దస్త్’ షో యాంకర్ గా మారింది. ఈ షోలో చలాకీగా, తన మాటలతో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సౌమ్య రియల్ లైఫ్ లో చాలా సమస్యలను  ఎదుర్కొంది. ముఖ్యంగా సౌమ్యా రావు తల్లి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. మదర్స్ డే రోజున సౌమ్యా రావు తన తల్లి వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ, చివరి రోజుల్లో తల్లి పడిన బాధను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది.
తన తల్లి పడిన నరకయాతన మరో తల్లికి రాకూడదని ఎమోషనల్ అయ్యారు. “అమ్మ, డాక్టర్లు, అంబులెన్స్, మందులు, ట్రీట్‌మెంట్, బాధ. అది ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. దేవుడికి ఎన్ని పూజలు, ఉపవాసాలు చేసినా వృథా అయ్యాయి. అమ్మా నువ్వు లేకుండా నా లైఫ్ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు మళ్లీ నా కోసం పుడతావని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దేవుడా నా తల్లిదండ్రులను మళ్ళీ నాకు ఇవ్వు” అంటూ తన తల్లికి మదర్స్ డే విషెస్ చెప్తూ సౌమ్యా రావు ఎమోషనల్ అయ్యారు. సౌమ్య రావు పోస్ట్‌ చూసిన నెటిజెన్లు ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు జీవితంలో కొల్పోయిన ఆనందాలను దేవుడు తిరిగి ఇస్తాడని సోషల్ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: యంగ్ క్రికెటర్ “యశస్వి జైస్వాల్”… రాజమౌళి “విక్రమార్కుడు” సినిమాలో నటించారా?