సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్ లో చాలా మంది యంగ్ ప్లేయర్స్ తమ టాలెంట్ ను నిరూపించుకుని వెలుగులోకి రావడమే కాకుండా ఐపీఎల్ స్టార్లుగా మారుతున్నారు.

Video Advertisement

ఈ క్రమంలో ఈ ఏడాది జరుగుతున్నఐపీఎల్ 16 వ సీజన్ లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ క్రికెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అయితే ఈసారి తన ఆటతో మాత్రం కాదు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి సీజన్ లాగే ఈ ఐపీఎల్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఒకరు యశస్వి జైస్వాల్. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. యశస్వి తన బ్యాటింగ్ తో సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బక్క పల్చగా ఉండే యశస్వి కొడుతున్న సిక్సర్లు చూసి ఆడియెన్స్  అవాక్కవుతున్నారని చెప్పవచ్చు. ఆడే ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ గా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. దేశవాళి క్రికెట్ లో వలె ఐపీఎల్ లో కూడా తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను, మాజీ క్రికెటర్లను ఆకర్షించాడు. రీసెంట్ గా ఆడిన మ్యాచ్‌లో 98 రన్స్ చేసి మరోసారి ఆకట్టుకున్నాడు.  ఈ ఇన్నింగ్స్ తో అతను వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా యశస్వి  జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి, తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే అది క్రికెట్‌కు సంబంధించిన విషయంలో కాదు.
యశస్వి  జైస్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ సినిమాలోని బాలనటుడిని పోలి ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విక్రమార్కుడు సినిమాలో ఒక  బాల నటుడు హీరో రవితేజతో కలిసి ఒక సన్నివేశంలో నటించాడు. ఆ అబ్బాయికి, యశస్వి  జైస్వాల్ మధ్య పోలికలు  ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి  జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి  జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.

Also Read: “ధోనీ” లాంటి క్రికెటర్, శతాబ్దానికి ఒక్కడే వస్తాడు..! సునీల్ గవాస్కర్