భారత క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ కన్నా ముందుగా టెస్టులలో 10 వేల పరుగులు సాధించిన దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్. సచిన్ టెండూల్కర్‌ తరం ఆటగాళ్లకు సునీల్ గవాస్కర్ ఆదర్శంగా నిలిచారు.

Video Advertisement

70 ఏళ్లు దాటినా ఇప్పటికి గవాస్కర్ క్రికెట్‌తో ఉన్న తన బంధాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో తన తరువాత వచ్చిన రెండో తరపు క్రికెటర్ ధోనీ దగ్గర గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా ధోనీని శతాబ్దానికి వచ్చే ఒక్క ప్లేయర్ గా పేర్కొన్నాడు.  ఐపీఎల్ 16 వ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో కోల్‌కతా జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ధోనీ స్టేడియం చుట్టూ తిరిగాడు. ఆ సమయంలో చెన్నై ప్లేయర్స్ అంతా ధోనితో నడుస్తూ ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. ఈ  క్రమంలో అక్కడికి వెళ్ళిన గవాస్కర్ ధోనిని ఆటోగ్రాఫ్ ఇవ్వమని అడిగి, తన షర్ట్ పైనే గవాస్కర్ ధోనీ ఆటోగ్రాఫ్ ను  తీసుకున్నాడు. కొన్ని రోజులుగా చెపాక్ లోనే ధోనీ చివరి ఐపీఎల్ మ్యాచ్ అని, రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ దగ్గర దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న తరువాత ధోనీ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. “ధోనీ కనీసం వచ్చే ఐపీఎల్ సీజన్ లేదా మరిన్ని సీజన్లలో ఆడాలని అన్నారు. ధోనీ ఆడటం వల్ల ఐపీఎల్ చాలా ప్రయోజనం ఉంటుందని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ 10 ఏళ్లకు ఓ సారి వచ్చే ఆటగాడు కాదని, వందేళ్లకు ఒకసారి వచ్చే ఆటగాడని కొనియాడారు.కెవిన్ పీటర్సన్ గతంలో ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాలని అన్నారు. నూరేళ్లకు ఓ సారి వచ్చే ధోనీ లాంటి ప్లేయర్ ను అభిమానులు మళ్లీ మళ్లీ చూడాలని భావిస్తారని, కనుక ఇదే ధోనీ ఆఖరి సీజన్ కాదని, మళ్లీ ఆడతాడనే భావిస్తున్నానని” అని గావాస్కర్ అన్నారు.

Also Read: IPL 2023 లో “ప్లే ఆఫ్స్” కి చేరే అవకాశం ఉన్న… 4 జట్లు ఇవేనా..?