IPL 2023 లో “ప్లే ఆఫ్స్” కి చేరే అవకాశం ఉన్న… 4 జట్లు ఇవేనా..?

IPL 2023 లో “ప్లే ఆఫ్స్” కి చేరే అవకాశం ఉన్న… 4 జట్లు ఇవేనా..?

by kavitha

ఐపీఎల్ 16 వ సీజన్ లో గ్రూప్ దశలో ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్లేఆఫ్స్ చేరే టీమ్స్  విషయంలో స్పష్టత మాత్రం రాలేదు. అయితే ముంబై, గుజరాత్, లక్నో జట్లు ప్లేఆఫ్స్ పోరులో ముందున్నాయి.

Video Advertisement

ఐపీఎల్ 2023 లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప మిగతా తొమ్మిది టీమ్స్ ఇంకా ప్లేఆఫ్స్ పొరులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఒత్తిడిని తట్టుకుని గెలిచిన జట్లే ప్లేఆఫ్స్ కు వెళ్తాయి. అయితే 9 జట్లు ప్లేఆఫ్స్ పోరులో ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని జట్లకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్లేఆఫ్ దశకు చేరే గణాంకాలు ఇప్పుడు చూద్దాం.. #1 గుజరాత్ టైటాన్స్:

ఈ జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు ఒక మ్యాచ్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. ఆ జట్టు నెక్స్ట్ స్టేజ్ కు  వెళ్ళడానికి 99.6 శాతం ఛాన్స్ ఉంది. అంతే కాకుండా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే క్వాలిఫైయర్ 1కు వెళ్ళేందుకు 92 శాతం ఛాన్స్ ఉంది.#2 చెన్నై సూపర్ కింగ్స్:

చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ జట్టు పై గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని చేరుకుంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంది. ఈ జట్టు నెక్స్ట్ దశకు చేరుకునేందుకు 98 శాతం ఛాన్స్ ఉంది. అదే సమయంలో ధోనీసేన క్వాలిఫైయర్ 1కు వెళ్ళే  70 శాతం ఛాన్స్ ఉంది. #3 ముంబై ఇండియన్స్:

బెంగళూరు జట్టు పై సాధించిన విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 3 వ స్థానానికి చేరింది. ప్లేఆఫ్స్‌కు వెళ్ళే  అవకాశాలను కూడా పెంచుకుంది. 3 మ్యాచ్‌ల్లో గెలిస్తే సాధిస్తే నాకౌట్‌ స్టేజ్ కు అర్హత సాధిస్తుంది. ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరడానికి  61 శాతం ఛాన్స్ ఉంది. ముంబై క్వాలిఫైయర్ 1 ఆడేందుకు 16 శాతం ఛాన్స్ ఉంది. #4 లక్నో సూపర్ జెయింట్స్:

ఈ జట్టు  11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4 వ స్థానానికి చేరింది. ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు ప్రస్తుతానికి 44 శాతం ఛాన్స్ ఉంది. ఈ జట్టు నెక్స్ట్ దశకు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
#5 రాజస్థాన్ రాయల్స్:

ఈ జట్టు ఐపీఎల్ 16 వ సీజన్‌ను గెలుపుతో మొదలుపెట్టింది. అలాగే తొలి 5 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి ప్లేఆఫ్స్ పోరులో ఫేవరేట్‌గా మారింది. అయితే  ఆ తర్వాత జరిగిన 6 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి ఈ జట్టు ప్లేఆఫ్స్ పోరులో వెనుకబడింది. ఈ జట్టు ఖాతాలో 10  పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు 25 శాతం ఛాన్స్ ఉంది.#6 కోల్‌కతా నైట్ రైడర్స్:

ఈ జట్టు మొదటి 3 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లలో వరుసగా నాల్గింటిలో ఓడింది. ఆఖరి 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్ లలో గెలిచి పది పాయింట్లు సాదించింది. ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు 23 శాతం ఛాన్స్ ఉంది. #7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, ఫాఫ్ డుప్లెసిస్‌ బాగా ఆడుతుండటంతో ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరతారని భావించారు. కానీ ఆఖరి 2  మ్యాచ్‌ల్లో ముంబై, ఢిల్లీ జట్లతో ఓటమిపాలైంది. దాంతో ఈ జట్టు ప్లేఆఫ్స్ కు చేరేందుకు 22 శాతం ఛాన్స్ ఉంది.  చివరి 3 మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే తప్ప బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో గెలవక పోయిన ఇంటికి వెళ్ళాల్సిందే.
#8 పంజాబ్ కింగ్స్.:

ఈ సీజన్ మొదట్లో వరుస విజయాలతో కాన్ఫిడెంట్‌గా పంజాబ్ కింగ్స్ జట్టు కనిపించింది. కానీ ముంబై, కోల్‌‌కతా జట్లతో జరిగిన చివరి 2 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం ఈ జట్టుకు 10 పాయింట్లు ఉన్నాయి. ఇక ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు 14 శాతం ఛాన్స్ ఉంది.#9 సన్‌రైజర్స్ హైదరాబాద్:

ఈ సీజన్ లో జరిగిన 10 మ్యాచ్‌ల్లో నాల్గింటిలో మాత్రమే గెలిచి ఈ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక ఈ  జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు 13 శాతం ఛాన్స్ ఉంది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ జట్టుకు ప్లేఆఫ్స్‌కు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటికి వెళ్ళాల్సిందే. #10 ఢిల్లీ క్యాపిటల్స్:

ఈ జట్టు సీజన్ మొదటి నుండి పేలవ ప్రదర్శనచేస్తోంది. ఈ జట్టు ఖాతా తెరవడానికి 6 మ్యాచ్‌లు ఆడిందిఅయితే  ఆ తర్వాత ఢిల్లీ తన ఆటను మెరుగుపరుచుకుని, 5 మ్యాచ్‌ల లో 4 మ్యాచ్ లు గెలిచింది. అయితే చెన్నై జట్టు చేతిలో ఓటమి పాలవడంతో ఈ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి అయ్యాయి. ఇక ఈ  జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు కేవలం 2 శాతం ఛాన్స్ ఉంది.

Also Read: “క్రికెట్” చరిత్రలోనే అభిమానులు అందరూ… సిగ్గుతో “తలదించుకునే” లాగా చేసిన 10 సందర్భాలు..!


You may also like