“క్రికెట్” చరిత్రలోనే అభిమానులు అందరూ… సిగ్గుతో “తలదించుకునే” లాగా చేసిన 10 సందర్భాలు..!

“క్రికెట్” చరిత్రలోనే అభిమానులు అందరూ… సిగ్గుతో “తలదించుకునే” లాగా చేసిన 10 సందర్భాలు..!

by kavitha

Ads

క్రికెట్ అనేది జెంటిల్ మెన్ గేమ్. కానీ ఈ జెంటిల్ మెన్ గేమ్ లో కూడా కొన్ని తలదించుకునే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. క్రికెట్ లో జరిగిన కొన్ని షేమ్ ఫుల్ సంఘటనల గురించి ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

1. క్రికెట్ లో కొన్ని సార్లు తిట్టుకోవడం దగ్గర నుండి కొట్టుకోవడం దాకా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ఎవరు కొట్టుకోలేదు.అయితే ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో పాక్ బ్యాట్స్ మెన్ జావేద్ మియాందాద్ ఆస్ట్రేలియా బౌలర్ బిల్లీ వేసిన బంతిని ఎదుర్కొని రన్స్ కోసం పరుగెడుతున్న సమయంలో బిల్లీని ఢీ కొన్నాడు. చెప్పాలంటే బిల్లీ కావాలనే జావేద్ కు అడ్డుగా వచ్చాడు. అక్కడితో ఆగకుండా అంపైర్ దగ్గర ఉన్న స్వెటర్ తీసుకుంటూ పక్కనే ఉన్న జావేద్ ను కాలితో తన్నాడు. దాంతో జావేద్ కు కోపం వచ్చి బిల్లీని బ్యాట్ తో కొట్టబోయాడు. కానీ అంపైర్ అతన్ని ఆపి, ఇద్దరినీ కూల్ చేసి పంపించాడు.
2. ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాక్ బౌలర్ షాహిద్ అఫ్రిది భారతజట్టులో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లను అవుట్ చేసి, ఇండియాను ఓడించాలనే కోరికను తీర్చాడు. ఆ తరువాత మ్యాచ్ లో అఫ్రిది బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాక్ ఆడియెన్స్ ముందు మ్యాచ్ లో అవుతా అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ పేర్లను పదే పదే అరుస్తు ఉన్నారు. వారి అరుపులు విన్న అఫ్రిది ఆ ముగ్గురు బ్యాట్స్ మెన్స్ ఎలా అవుట్ అయ్యారో ఇమిటేట్ చేసి చూపించారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన అఫ్రిది ఇలా చేయడం సిగ్గుచేటని చెప్పవచ్చు.
3. అతిధి దేవో భవ అని అంటుంటాం. కానీ ఈ విషయం ఇంగ్లండ్ ఫ్యాన్స్ మాత్రం పాటించలేదు. క్రికెట్ దేవాలయంగా భావించేటువంటి లార్డ్స్ మైదానంలో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కే ఎల్ రాహుల్ పై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ షంపైన్ బాటిల్ క్యాప్స్ విసిరేశారు. దీన్ని చూసిన విరాట్ కోహ్లీ వాటిని తిరిగి వారి పైకి విసిరేయమని అన్నాడు. ఫ్యాన్స్ చేసింది చూసిన కామెంటేటర్స్ కూడా వాళ్ళు చేసిన పనికి వారిని అసహ్యించుకున్నారు.
4. క్రికెట్ లో అంపైర్ డిసిషన్ ని ఫైనల్ డిసిషన్ గా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్లేయర్స్ అత్యుత్సాహంతో  టెంపర్ మెంట్ ను అంపైర్ పై అరుస్తూ ఉంటారు. ఇలాంటిదే ఢాకా ప్రీమియర్ లీగ్ లో జరిగింది. ఒక మ్యాచ్ లో షకిబ్ అల్ హాసన్ బౌలింగ్ చేస్తూ ఎల్బిడబ్ల్యు కోసం పదే పదే అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ స్పందించక పోవడంతో షకిబ్ అల్ హాసన్ కోపంగా వెళ్ళి స్టంప్స్ ని తన్నాడు.

ఆ తరువాత ఓవర్ లో అంపైర్ తో వాదించాడు. అక్కడి తో ఆగకుండా స్టంప్స్ ను తీసి పడేశాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా అతన్ని భీభత్సంగా ట్రోల్ చేశారు. బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బోర్డ్ 5 లక్షల ఫైన్, 3 మ్యాచ్ ల నిషేధాన్ని విధించింది.
5. ఇండియా శ్రీలంక మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నసెహ్వాగ్ సెంచరీకి ఇంకా ఒక పరుగు అవసరం ఉన్న సమయంలో సూరజ్ రందీవ్ సెంచరీని అడ్డుకోవడానికి చివరి బంతిని ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేసాడు. సెహ్వాగ్ దాన్ని సిక్సర్ కొట్టాడు. భారత్ గెలిచింది. కానీ సెహ్వాగ్ సెంచరీ మిస్ అయ్యాడు. నో బాల్ వేసిన సూరజ్కు ఒక మ్యాచ్ నిషేధం విధించారు.
6. 2012 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వాటిని విన్న కోహ్లీ వాళ్ళకి తన మిడిల్ ఫింగర్ ను చూపించాడు. అలా చేసినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజ్ లో 50% కోత విధించారు. అలాగే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తరువాత తప్పు తెలుసుకుని ఇలా చేయడమే తప్పే, కానీ వాళ్ళు నీ  తల్లి, చెల్లి అంటూ అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఏం చేయాలి అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
7.  2009లో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం శ్రీలంక జట్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు వెళుతుండగా, తాలిబాన్లకు చెందిన ఉగ్రవాదులు వారి బస్సు పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు, సిబ్బంది గాయపడ్డారు. వెంటనే ఆ మ్యాచ్ ను రద్దు చేసుకొని, శ్రీలంక ప్లేయర్స్ ను క్రికెట్ గ్రౌండ్ లోనే హెలికాప్టర్ ఎక్కించి,  శ్రీలంకకు తీసుకెళ్లారు. ఆ రోజును క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే గా పరిగణించారు.
8. క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల మధ్య స్నేహం, అవగాహన ఉంటే ఆ జట్టు రాణిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య తప్పుగా అర్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఢాకా ప్రీమియర్ లీగ్ లో జరిగింది. ఒక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ కొట్టిన ఒక బాల్ ను పట్టుకోవడానికి బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ఇద్దరు వెళ్లారు. ఆ ప్రయత్నంలో ఇద్దరు ఢీకొన్నారు. రహీమ్ బాల్ ను పట్టుకున్నాడు. అయిన కోపంతో నసుమ్ అహ్మద్ ను కొట్టడానికి చేయి పైకి ఎత్తాడు. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగాడు.
9. 1981 లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవాలంటే చివరి బంతికి 6 పరుగులు చేయాలి. అంటే చివరి బంతిని సిక్స్ కొడితే న్యూజిలాండ్, కొట్టలేకపోతే ఆస్ట్రేలియా గెలుస్తుంది. అయితే ఆసీస్ బౌలర్ బంతిని కొట్టడానికి వీలు లేకుండా వేశాడు. దాంతో న్యూజిలాండ్ ఓడిపోయింది. బ్యాట్స్ మెన్ కోపంతో బ్యాట్ విసిరేసి వెళ్ళిపోయాడు. బాల్ అలా వేయడం తప్పు కానప్పటికీ, క్రీడాస్పూర్తికి విరుద్ధం. న్యూజిలాండ్ ఫ్యాన్స్, తో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కూడా ఆ బౌలర్ పై ఆగ్రహించారు. రెండు దేశాల పీఎంలు కూడా దీన్ని విమర్శించారు. అయితే దీన్ని చాపెల్ బ్రదర్స్ కావాలని చేశారు.
10. 1996 లో ఇండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో దేశమంతా సిగ్గుపడే సంఘటన జరిగింది. భారత్ 15.5 ఓవర్లలో 120 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోవడంతో భారత అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. గ్రౌండ్లో కి బాటిల్స్, చెప్పులు స్టేడియంలోకి విసరేసి, సీట్లకు నిప్పు అంటించారు. మ్యాచ్ ను 30 నిమిషాల పాటు ఆపారు. తరువాత మ్యాచ్ మొదలు పెట్టగా పరిస్థితి అలాగే ఉండడంతో డిఫాల్ట్‌గా శ్రీలంక గెలిచినట్లుగా ప్రకటించారు. మార్చి 13, 1996, క్రికెట్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అలాగే షేమ్ ఫుల్ ఇన్సిడెంట్స్ లో ఈ సంఘటన ముందు వరుసలో ఉంటుంది.

Also Read: IPL చరిత్రలో “వరస్ట్ ప్లేయర్స్” గా పేరు తెచ్చుకున్న 7 క్రికెటర్స్..! ఎవరెవరు ఉన్నారంటే..?


End of Article

You may also like