IPL చరిత్రలో “వరస్ట్ ప్లేయర్స్” గా పేరు తెచ్చుకున్న 7 క్రికెటర్స్..! ఎవరెవరు ఉన్నారంటే..?

IPL చరిత్రలో “వరస్ట్ ప్లేయర్స్” గా పేరు తెచ్చుకున్న 7 క్రికెటర్స్..! ఎవరెవరు ఉన్నారంటే..?

by kavitha

Ads

ఐపీఎల్‌ కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఇప్పటివరకు చూశాం. ఐపీఎల్‌లో ఎంతో మంది అద్భుతంగా ఆడే బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు ఉన్నారు. వారు తమ ఆటతో ఫ్యాన్స్ ను ఎంతగానో అలరించారు.

Video Advertisement

అయితే కొంతమంది ఆటగాళ్ళు మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేక, ఐపీఎల్‌ చరిత్రలో వరెస్ట్ ప్లేయర్స్ గా నిలిచారు. అందులో సిక్సర్ల వీరుడిగా పేరు గాంచిన యువరాజ్ సింగ్ ఉండడం షాక్ అయ్యే విషయం. అయితే ఐపీఎల్‌ లో వరెస్ట్ ప్లేయర్స్ గా నిలిచిన వారెవరో ఇప్పుడు చూద్దాం..
1. అశోక్ దిండా:

ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్, పూణే వారియర్స్ ఇండియా, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి అనేక జట్ల తరుపున అశోక్ దిండా బౌలింగ్ చేశాడు. అయితే అశోక్ ఐపీఎల్‌ చరిత్రలో వరెస్ట్ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ఐపీఎల్‌లో 100 ఓవర్లు వేసిన బౌలర్లలో అశోక్ దిండా రేట్ 8.20 తో అత్యధికంగా ఉంది. 78 మ్యాచ్‌లు ఆడి, 69 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్‌లో దిండా అకాడమీ మీమ్స్‌ తో అతను బాగా పాపులర్ అయ్యాడు.
2. ఎస్ శ్రీశాంత్:

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ లాంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపిఎల్‌లో అతని ప్రదర్శన అంత సంతృప్తికరంగా లేదు. శ్రీశాంత్ ఐపీఎల్‌లో 44 మ్యాచ్‌లు ఆడి, 40 వికెట్లు మాత్రమే తీశాడు. శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్‌ వివాదంలో నిషేదించబడ్డాడు. ఆ తర్వాత అతనికి ఐపీఎల్‌ లో ఆడే ఛాన్స్ రాలేదు.
3. జోగిందర్ శర్మ:

జోగిందర్ శర్మ ఐపీఎల్‌లో  చెన్నై సూపర్ కింగ్స్‌  తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో సక్సెస్ అయినప్పటికీ, శర్మ ఐపీఎల్‌లో ప్రభావం చూపలేకపోయాడు. ఐపీఎల్‌లో 250 బంతుల్లో 35.82 సగటుతో 12 వికెట్లు మాత్రమే తీశాడు. T20 ప్రపంచ కప్ 2007 విజయంలో కీలక మ్యాచ్ లో జోగిందర్ శర్మ బౌలింగ్ అందరికి గుర్తుంటుంది. కానీ జోగీందర్ శర్మ ఐపీఎల్‌లో రాణించలేక చెత్త ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచాడు.
4. యువరాజ్ సింగ్:

భారత అత్యుత్తమ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, పూణే వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్ల తరపున ఐపీఎల్‌లోఆడాడు.  యువరాజ్ నిలకడగా రాణించడంలో ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడి, 24.77 సగటుతో 2750 పరుగులు చేశాడు. యువరాజ్ 29.91 సగటుతో 36 వికెట్లు తీశాడు.
5. కార్లోస్ బ్రాత్‌వైట్:

కార్లోస్ బ్రాత్‌వైట్, విధ్వంసకర బ్యాట్స్‌మన్, వెస్టిండీస్ రెండో ప్రపంచ T20 టైటిల్‌ ను గెలవడంలో ముఖ్య పాత్రను పోషించాడు. ఈ బౌలర్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో కార్లోస్ 16 మ్యాచ్‌లు ఆడి, 13.29 సగటుతో 181 పరుగులు చేశాడు. బౌలర్ గా, 42 ఓవర్లలో 13 వికెట్లు తీసి, సగటున 30కి దగ్గరగా 400 పైగా పరుగులకు ఇచ్చాడు.  కార్లోస్ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ అయినప్పటికీ, కార్లోస్ బ్రైత్‌వైట్ ఐపీఎల్‌లో వరెస్ట్ ప్లేయర్స్ ఒకరిగా నిలిచాడు.
6. ఆరోన్ ఫించ్:

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడు, మెల్బోర్న్ రెనెగేడ్స్ మాజీ కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచాడు. ఒకప్పుడు ఆరోన్ ఫించ్ రెండేళ్ల పాటు నంబర్ వన్  T20 బ్యాటర్. కానీ ఐపీఎల్‌లో అతను నిలకడగా రాణించలేకపోయాడు. 90 మ్యాచ్‌లు ఆడి, 25.70 సగటుతో 2091 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఆరోన్ ఫించ్ ఎక్కువ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
7. డారెన్ సమీ:

డారెన్ సామీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్, టీ20 ప్రపంచకప్‌ని రెండుసార్లు గెలిచిన ఏకైక కెప్టెన్‌ సమీ. ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్ల తరుపున ఆడాడు.

మిక్స్డ్ ఇంటర్నేషనల్ కెరీర్ ఉన్నప్పటికీ, డారెన్ సామీ ఐపీఎల్‌లో రాణించలేక పోయాడు. ఐపీఎల్‌లో 22 మ్యాచ్‌లు ఆడి,  350 పరుగులు ఇచ్చాడు. 31.81 సగటుతో 11 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

Also Read: “శ్రీశాంత్” తో పాటు… వివాదాల వల్ల “క్రికెట్ కెరీర్” పోగొట్టుకున్న 5 ప్లేయర్స్..!


End of Article

You may also like