Ads
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో ఎవరు? అంటే దానికి టక్కున సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత మంది హీరోలు మరో సినీ పరిశ్రమలో లేరు. ఎవరికి వారే సపరేట్ ఫ్యాన్ బేస్ తో, సపరేట్ ఇమేజ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మన హీరోలు ఇప్పుడు ప్రపంచమంతా తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఈ మధ్యకాలంలో వరుసగా బాక్స్ ఆఫీస్ సక్సెస్ లను అందుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రేజ్ అందుకుంటున్నారు.
Video Advertisement
ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలకి టాప్ తెలుగు హీరో, హీరోయిన్స్ లిస్ట్ విడుదల చేస్తుంది. అలా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించిన హీరోల లిస్ట్ ప్రకారం ప్రభాస్ ఎప్పటిలాగే మొదటి స్థానం లో ఉండగా.. రామ్ చరణ్ రెండో స్థానం లో ఉన్నారు..
ఆర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం టాప్ టెన్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
#1 ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ పభాస్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడంతో పాటు వరుసగా పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరోను నమ్మి నిర్మాతలు 2000 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు. ఇక ఈయన పలు సర్వ్ లలో కూడా నెంబర్ 1 గా నిలుస్తున్నారు. ఏప్రిల్ నెలలో కూడా ఆర్మాక్స్ మీడియా సర్వే లో మొదటిస్థానం నిలబెట్టుకున్నాడు ప్రభాస్.
#2 రామ్ చరణ్
కెరీర్ పరంగా బిజీగా ఉన్న చరణ్ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
#3 ఎన్టీఆర్
పలు క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన ఎన్టీఆర్ కు ఈ జాబితాలో మూడో స్థానం దక్కింది.
#4 అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.
#5 మహేష్ బాబు
గతేడాది సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.
#6 నాని
ఈ ఏడాది దసరా మూవీతో సక్సెస్ ను సొంతం చేసుకోగా ఈ హీరోకు ఆరో స్థానం దక్కింది.
#7 పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. పవన్ పాన్ ఇండియా స్థాయి చిత్రాలు చేస్తే ఆయన రాంక్ కి తిరుగుండదు.
#8 చిరంజీవి
సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా గత కొంత కాలంగా ఆర్మాక్స్ సర్వేలో మంచి ర్యాంకును అందుకుంటూ వస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అనుకోవడంతో ఇప్పుడు ఎనిమిదో స్థానంలో నిలిచారు.
#9 విజయ్ దేవరకొండ
ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా విజయ్ దేవరకొండ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీస్ అప్డేట్స్ తో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచారు ఈ రౌడీ హీరో.
#10 రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో పదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
End of Article