Ads
తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి అదే టైటిల్‌తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.
Video Advertisement
అయితే ఛత్రపతి లాంటి సినిమాను రీమేక్ చేయడం భారీ సాహసం అయినప్పటికీ ఈ మూవీ ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బడ్జెట్ అన్ని వ్యయాలతో కలిపి 50 కోట్లు అయ్యింది. ఇక పెన్ మీడియా లిమిటెడ్ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాను 2000 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ఓవర్సీస్‌లో మొత్తంగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను 2300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 55 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. దాదాపు ఈ చిత్రం 75 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే తొలి రోజు నుంచే కలెక్షన్లు మాత్రం భారీగా నిరాశ పరిచాయి. హిందీ ఛత్రపతి మూవీ తొలి రోజు ఆక్యుపెన్సీ చాలా పూర్‌గా నమోదైంది. మార్నింగ్ షోకు 10 శాతం కంటే తక్కువ, మ్యాట్నీకి 15 కంటే తక్కువగానే నమోదైంది.
ఈ సినిమా ఇండియా వైడ్ తొలి రోజు 60 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో 10 లక్షల మేర వసూళ్లు రాబట్టింది. దాంతో తొలి రోజు 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొదటి రోజు నుండే అంచనాలను అందుకోలేక పోయిన సినిమా వీకెండ్ లోనే చేతులు ఎత్తేయగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమా సగానికి పైగా థియేటర్స్ ని కోల్పోయింది.
ఇక వీకెండ్ లోనే సినిమా కోటి లోపు నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 4వ రోజు ఇండియాలో 7 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 5వ రోజున 5 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా 5 రోజుల్లో ఇప్పుడు 1.12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది . టోటల్ గా వర్త్ షేర్ 45 లక్షల లోపే ఉంటుందని అంటున్నారు. టోటల్ గా ఈ మూవీ 5% కూడా రికవరీని కూడా సొంతం చేసుకోలేక పోయింది.
ఎన్నో ఆశలతో బెల్లంకొండ శ్రీనివాస్ గ్రాండ్ గా తన హిందీ డెబ్యూట్ ప్లాన్ చేసుకుంటే కనీసం ఓపెనింగ్స్, తెలుగులో ఓ చిన్న హీరోకి వచ్చే అంత కూడా రాలేదు. ఛత్రపతి డిజాస్టర్ అవ్వడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టం మిగిలింది. యూట్యూబ్ అతడి సినిమాలకు రికార్డు స్థాయి వ్యూస్ వస్తుంటే.. అవి థియేటర్ వరకు రాలేదని తెలుస్తోంది. ఇక అతడి తదుపరి ప్రోజెక్టుల వివరాలు తెలియాల్సి ఉంది.
End of Article