Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడం తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.
Video Advertisement
బాహుబలి చిత్రం తర్వాత వచ్చిన సాహో చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడం తో.. డార్లింగ్ ఫాన్స్ ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాధేశ్యామ్ సినిమా గతేడాది మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది.
ఈ మూవీలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. స్టోరీ, స్క్రీన్ ప్లే లో క్లారిటీ లోపించడంతో ఈ సినిమా థియేటర్ లో ఘోరంగా విఫలం అయ్యింది. ఈ సినిమాతో యూవీ వారికీ గట్టిగానే పడింది. ఏకంగా 70-80 కోట్ల నష్టాలను మిగిల్చిందని వార్తలు వచ్చాయి.
రొటీన్ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ‘రాధే శ్యామ్’ను పీరియాడిక్ మూవీగా యూరప్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. అయితే ఈ క్లాసిక్ లవ్ స్టోరీ లో మొదట హీరోగా ప్రభాస్ ని అనుకోలేదట. దర్శకుడు రాధా కృష్ణ ఈ కథని విక్టరీ వెంకటేష్ కోసం రాయగా.. ఆయన రిజెక్ట్ చేశారట. అప్పటికే వెంకటేష్ చేతిలో వేరే చిత్రాలు ఉండటం.. ఈ కథ తనకు సెట్ అవ్వదు అనిపించి ఆయన వదులుకున్నారట.
దీంతో ఈ స్టోరీ ప్రభాస్ వద్దకు చేరింది. ఆయనకు బాగా నచ్చడంతో ఒప్పుకున్నారు. ఈ మూవీలో కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించారు. అనుకోని విధంగా ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
End of Article