Ads
విక్టరీ వెంకటేష్ … సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు. చాలా గొప్ప నటుడు. అంతే కాదు సంపూర్ణ నటుడు కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో విశ్వరూపం చూపిస్తాడు. స్టార్ హీరోలైన చిరు, నాగ్, బాలయ్య కెరీర్ లో ఎదో ఒక సందర్భం లో గ్యాప్ వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్లే.. కానీ వెంకటేష్ కి ఇప్పటివరకు ఆ పరిస్థితి రాలేదు.
Video Advertisement
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో…తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు హీరో వెంకటేష్. స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ఎంతోమంది హీరోయిన్లను వెంకీ తన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే కొంతమంది హీరోస్ కి అన్ని జానెర్స్ వర్కౌట్ అవ్వవు. కానీ వెంకటేష్ కి మాత్రం ఇది అతీతం.
ఆయన ఇప్పటి వరకు అన్నీ జానర్స్ ని టచ్ చేసాడు.కామెడీ, సెంటిమెంట్ , మాస్ , లవ్ స్టోరీస్ మరియు ఫ్యామిలీ స్టోరీస్ ఇలా అన్నీ జానర్స్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు విక్టరీ వెంకటేష్. అయితే వెంకటేష్ ఇప్పటి వరకు నేటి తరం టాప్ స్టార్ డైరెక్టర్స్ తో కలిసి పని చెయ్యలేదు. గతం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది కానీ దానికి సంబంధించిన అప్డేట్ లేదు.
అయితే వెంకటేష్ తన డ్రీం ప్రాజెక్ట్ ‘స్వామి వివేకానంద’ బయోపిక్ తియ్యాలని అనుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేసినా భారీ గానే చెయ్యాలని అనుకున్నాడు, అందుకే ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి ని డైరెక్ట్ చేయాల్సిందిగా మగధీర సినిమా విడుదలైన కొత్తల్లో అడిగాడట వెంకటేష్. రాజమౌళి ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కమిట్ అయిపోయి ఉన్నాయి, ఇవన్నీ పూర్తి అయ్యాక కచ్చితంగా చేద్దాం సార్ అన్నాడట.
కానీ ఆ తర్వాత రాజమౌళి బాహుబలి సిరీస్ తో బిజీ అవ్వడం, ఆ వెంటనే ఆర్ఆర్ఆర్, ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చెయ్యబోతున్నారు. మొత్తానికి రాజమౌళి ఇతర ప్రాజెక్ట్ ల కారణంగా.. వెంకీతో సినిమానే అలానే ఆగిపోయింది. ఇప్పట్లో వీరి కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
ఇక లేటెస్ట్ గా F3 చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని వెంకటేష్ , త్వరలోనే శైలేష్ దర్శకత్వం లో ‘సైంథవ్’ అనే చిత్రం ద్వారా మన ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు తమిళ హీరో ఆర్య కూడా ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు.
End of Article