Ads
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒకటి , ప్రశాంత్ నీల్ ల దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు. అయితే కథల ఎంపిక విషయం లో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా..
Video Advertisement
కథ విన్నాక అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని అంచనాకి రావాలంటే తారక్ తర్వాతే ఎవరైనా. ఆ విషయంలో ఎన్టీఆర్ చాలా ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటారు. అందుకే తన దగ్గరకు వచ్చే అనేక కథలలో కేవలం హిట్టు అవుతుంది అనుకున్న కథలను మాత్రమే ఎంచుకొని ముందుకు వెళుతున్నాడు.
ఇక ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూ ఉండగా.. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ వీకెండ్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు.
ఆంధ్ర , సీడెడ్ లలో మాత్రం బుకింగ్స్ నెక్స్ట్ లెవల్ లో దుమ్ము లేపే రేంజ్ లో ఉండగా మొత్తం ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి రోజు సింహాద్రి సినిమా ఇప్పుడు 1150 వరకు షోలు ఓవరాల్ గా పడబోతున్నాయి. ఇందులో ఆల్ మోస్ట్ 250 కి పైగా షోలు ఫుల్ అవ్వడం విశేషం. మిగిలిన సెంటర్స్ లో చాలా చోట్ల బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ వివరాలు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొత్త చిత్రాలు విడుదలైన కొన్ని రోజులకి వేగంగా ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చాలామంది సినిమా హాల్ కి వెళ్లి చూసే కంటే కూడా ఇంటి వద్దనే వీటిని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే మరోపక్క పాత సినిమాల రీ రిలీజ్ అంటే మాత్రం హాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. రీ రిలీజ్ లలో రికార్డ్స్ తిరగ రాస్తున్నారు హీరోలు.
End of Article