యాంకర్ జయతి గుర్తున్నారా? ఇపుడు ఎలా ఉన్నారో తెలుసా?

యాంకర్ జయతి గుర్తున్నారా? ఇపుడు ఎలా ఉన్నారో తెలుసా?

by kavitha

Ads

తెలుగులో మొదటి శాటిలైట్ ఛానల్ జెమినీ టీవీ వచ్చి సుమారుగా 33 ఏళ్లు అంటే మూడు దశాబ్దాలు పూర్తయ్యింది. జెమినీ టీవీలో ఇప్పటివరకు వెయ్యి మంది వరకు యాంకర్స్ ఆడియెన్స్ ను పలకరించి ఉంటారు. వీరిలో ఆడియెన్స్  గుర్తుంచుకునేవారు 10 మంది వరకు మాత్రమే ఉంటారు.

Video Advertisement

వీరిలో కొంతమంది ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది యాంకర్స్ మాత్రం మళ్ళీ కనిపించలేదు. వారు ఒక్క జెమినీ టీవీలో  మాత్రమే యాంకరింగ్ చేశారు. మరే ఛానెల్స్ లోనూ యాంకరింగ్ చేయలేదు. అలాంటివారిలో యాంకర్ జయతి ఒకరు. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..జెమినీ మ్యూజిక్ ‘ఆదిత్య టీవీ’ గా మొదలు అయినప్పటి నుండి ఆ ఛానెల్ లో రాత్రి 10 గంటలకు వచ్చే ‘వెన్నెల’ షోకి జయతి సుమారు 10 ఏళ్ల పాటు యాంకరింగ్ చేసింది. కాలర్స్‌తో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె మాటల కోసమే వెన్నెల ప్రోగ్రామ్ చూసేవారంటే ఆ రోజుల్లోనే ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పనవసరం లేదు. ఆ తరువాత తొలిసారి హీరోయిన్‌గా ‘ల‌చ్చి’ అనే చిత్రంలో నటించింది. దీనికి నిర్మాత కూడా జయతినే. ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ కనిపించలేదు. చాలా గ్యాప్ తరువాత జయతి రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆడియెన్స్ ని పలకరించింది. ఈ పాటలో జ‌య‌తి తన హావ భావాల‌తో, మూమెంట్స్‌లో ఆకట్టుకుంది.జ‌య‌తి విజ‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వచ్చిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. కాస్లర్ల శ్యామ్‌ రాసిన ఈ సాంగ్ ను శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో జయతి కనిపించారు. ఆమె ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆమె ఇన్నేళ్లకు కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

Also Read: “ఈ సారి కొరటాల శివ కం బ్యాక్ ఇవ్వడం పక్కా..!” అంటూ… NTR 30 “దేవర” ఫస్ట్‌లుక్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like