లీక్… లీక్… అని చెప్పి భలే మోసం చేశారుగా..? అసలు ఏం జరిగిందంటే..?

లీక్… లీక్… అని చెప్పి భలే మోసం చేశారుగా..? అసలు ఏం జరిగిందంటే..?

by Anudeep

Ads

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్‌ చేసింది ఈ సినిమా. ఇక రెండో పార్ట్ ‘పుష్ప ది రూల్ ’ను ప్రపంచవ్యాప్తంగా భారీ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Video Advertisement

‘పుష్ప ది రూల్’ కోసం అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫాన్స్ ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నారు. దీంతో పలు ఫేక్ వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా పుష్ప 2 నుంచి ఒక అప్డేట్ వైరల్ గా మారింది. పార్ట్ 1 లో పుష్పరాజ్ ప్రేయసిగా కనిపించి, చివరిలో పెళ్లి చేసుకుంటుంది శ్రీవల్లి. అయితే రెండో పార్ట్ లో శ్రీవల్లి పాత్ర చనిపోనుందని అంటూ ఒక ఫోటో వైరల్ గా మారింది.

rashmika mandanna fake photo is spreading which is from a marathi movie scene..

దీంతో అందరు ఈ పుకారుని నమ్మేశారు. శ్రీవల్లిగా అలరించిన రష్మిక మందన్న పాత్ర మధ్యలోనే చనిపోతుంది అని తెలిసి ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. అయితే వైరల్ గా మారిన ఆ ఫోటో పుష్ప 2 లోది కాదని తెలుస్తోంది. అసలు ఆ ఫోటో లో ఉన్నది రష్మిక నే కాదని సమాచారం. ఇది 2022లో విడుదలైన మరాఠీ చిత్రం ‘నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నాయ్ కొంచ’ నుండి వచ్చింది.

rashmika mandanna fake photo is spreading which is from a marathi movie scene..

ఇది ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇందులో రష్మిక అని అందరూ అనుకుంటున్న నటి పేరు ఇషా దివేకర్. వైరల్ గా మారిన ఈ ఫోటో ని చూసి హీరోయిన్ క్యారెక్టర్‌కి సంబంధించి ఇది కేజీఎఫ్ 2 కథలా ఉండబోతోందని పలువురు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు అది కాదని తెలిసింది.

rashmika mandanna fake photo is spreading which is from a marathi movie scene..

మరో వైపు వరల్డ్ వైడ్ గా ఒకేసారి పుష్ప 2 ను ఆడియెన్స్ ముందుకు తేవాలనే ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తున్నారు. ఇరవైకి పైగా దేశాల్లో ఈ మూవీని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది మైత్రీ టీమ్‌ అండ్‌ సుకుమార్‌ టీమ్‌.


End of Article

You may also like