Ads
సౌత్ ఇండియాలో రజనీకాంత్ కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆయన హృతిక్ రోషన్ లాగా అందంగా లేకపోయినా, సల్మాన్ ఖాన్ లాగా కండలు పెంచకపోయినా, అమితాబ్ బచ్చన్ లాగా ఆరడుగుల ఎత్తు లేకపోయినా. భారతీయ చలనచిత్ర రంగంలో సూపర్ స్టార్ హీరో అయ్యి ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ నటించిన సినిమాలు థియేటర్లలో విడుదలై కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తాయి.
Video Advertisement
సినిమాలలో కళ్ళద్దాలు పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపించే రజినీకాంత్ నిజజీవితంలో చాలా సాదాసీదాగా ఉంటారు. ఆయన ఎంత సాదాసీదాగా ఉంటారో తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఒకసారి గుడిలో ఆయన్ని చూసి ఒక మహిళ బిచ్చగాడు అనుకోని.. భిక్ష వేసిందట. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆయన బయట ఎంత సింపుల్ గా ఉంటారో..
సినిమాల్లో స్టయిల్ కి మారుపేరైన రజినీ నిజజీవితంలో ధోతీ, కుర్తా వంటి సాధారణ దుస్తులు ధరిస్తారు.ఇంట్లో ఉంటే లుంగీ, హవాయి చెప్పులు తప్పించి మిగతా ఏ హంగు ఆర్భాటాలకు పోరు. తలకి విగ్ పెట్టుకోవడం గానీ.. జట్టుకి నల్ల రంగు వేసుకోవడం గాని రజనీకాంత్ కి అస్సలు నచ్చదు.
అభిమానులను సంతోష పెట్టడం కోసమే తాను సినిమాల్లో చాలా స్టైలిష్ గా కనిపిస్తానని రజిని చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే రజనీకాంత్ వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించరు. అయితే రజనీకాంత్ ఉన్నట్లుగా మిగిలిన హీరోలు ఎందుకు సింపుల్ గా ఉండరు అని కోరా లో ఒక ప్రశ్న వచ్చింది. దానికి వెంకట రమణ అనే యూసర్ ఇలా సమాధానం ఇచ్చారు..
“రజనీ కాంత్ కు మిగిలిన నటులకు వ్యత్యాసం వుంది. ఆయన ఇమేజ్ ని తలకెక్కించుకోలేదు. అభిమానులను ప్రేమగా చూస్తారు తప్ప, తనెలా మసలాలో మరొకరు నిర్ణయించే పరిస్థితికి తావు లేకుండా నడుచుకుంటున్నారు. తెరపై తన ఆహార్యం, నటన, సంభాషణలు వంటి విషయంలో తన అభిమానులకు ఎలా కావాలో అలా చేస్తారు కానీ.. నిజ జీవితం లో వాటికి దూరం గా ఉంటారు.
అంతే కాకుండా ఈ జన్మ గురించి, ఈ శరీరం గురించి పూర్తి అవగాహన వున్న వ్యక్తి రజని కాంత్. అందుకే తరచు హిమాలయాలకు వెళ్ళి, కొన్నాళ్ళు ధ్యానం చేసి వస్తుంటారు.” అని ఆ నెటిజన్ సమాధానం ఇచ్చారు. ఈ పోస్ట్ కి పలువురు నెటిజన్లు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
End of Article