Ads
మీకు ఇష్టమైన హీరో ఎవరు అనగానే అందరికి టక్కున ఏదొక పేరు గుర్తు వస్తుంది. అయితే మీకు ఎంతో ఇష్టమైన నటుడి అసలు పేరు అది కాకపోవచ్చు. కొన్ని కారణాల వల్ల నటులు పేరు మార్చుకుంటూ ఉంటారు. అయితే కొందరు సినిమాల్లోకి రాక ముందే పేర్లు మార్చుకుంటే.. మరి కొందరు కొన్ని సినిమాలు చేసిన తర్వాత పేరు మార్చుకున్నారు.
Video Advertisement
వారి నమ్మకాల వల్ల కొందరు వారి పేర్లు మార్చుకున్నారు.. మరికొందరు పేర్లలో అక్షరాలను మార్చుకున్నారు. ఇప్పుడు అలా కొన్ని సినిమాల తరువాత పేర్లు మార్చుకున్న నటులెవరో చూద్దాం..
#1 రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా ఎదిగాడు చెర్రీ.. తొలినాళ్లలో రామ్ చరణ్ తేజ్ అని పేరు వచ్చేది మూవీస్ లో.. కానీ ఎవడు చిత్ర సమయం నుంచి రామ్ చరణ్ గా మార్చుకున్నాడు.
#2 సాయి ధరమ్ తేజ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరుని సాయి తేజ్ గా మార్చుకున్నాడు.
#3 తనీష్
బాల నటుడిగా సినిమాల్లో తన ప్రయాణం మొదలు పెట్టిన తనీష్ పేరు మొదట్లో సాయి శుభకర్ అని ఉండేది. తరువాత దాన్ని తనీష్ గా మార్చుకున్నారు.
#4 లక్ష్మి రాయ్
పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ.. తన పేరుని రాయ్ లక్ష్మి గా మార్చుకుంది.
#5 అరుణ్ అదిత్
పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరో అరుణ్ అదిత్ తన పేరుని త్రిగుణ్ గా మార్చుకున్నాడు.
#6 మంచు మనోజ్
మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బాల నటుడిగా, హీరోగా కొన్ని సినిమాల్లో నటించినప్పుడు మంచు మనోజ్ కుమార్ అని పేరు వేసేవారు. ప్రస్తుతం మంచు మనోజ్ అని వేస్తున్నారు.
#7 సంయుక్త మీనన్
ప్రస్తుతం వరుస హిట్స్ తో గోల్డెన్ లెగ్ గా పేరొందిన సంయుక్త.. కొన్ని సినిమాలు చేసిన తర్వాత తన పేరులో మీనన్ ని తీసేసింది.
#8 మంచు విష్ణు
మంచు విష్ణు పేరు కూడా మొదట్లో మంచు విష్ణువర్ధన్ బాబు అని వేసేవారు.
#9 నయనతార
నయనతార తన కెరీర్ మొదట్లో మోడలింగ్ చేసేది అన్న విషయం మనకి తెల్సిందే. అప్పుడు ఆమె పేరు డయానా మరియం కురియన్. ఆ తర్వాత నయనతార గా మార్చుకుంది.
#10 పాయల్ ఘోష్
ప్రయాణం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది పాయల్ ఘోష్. ఈమె పేరు హారిక. ఆ తరువాత పాయల్ ఘోష్ గా మార్చుకుంది.
#11 రాశి
బాలనటిగా మొదలు పెట్టి ఇండస్ట్రీ లో సక్సెఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రాశి. కానీ ఈమె పేరు విజయ. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాశి గా పేరు మార్చుకుంది.
#12 పవన్ కళ్యాణ్
మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ బాబు. ఆయన రెండో చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకున్నారు.
End of Article