“మెగాస్టార్ చిరంజీవి” డైరెక్ట్ చేసిన మూవీ ఏంటో తెలుసా..? కానీ ట్విస్ట్ ఏంటంటే..?

“మెగాస్టార్ చిరంజీవి” డైరెక్ట్ చేసిన మూవీ ఏంటో తెలుసా..? కానీ ట్విస్ట్ ఏంటంటే..?

by Anudeep

Ads

మెగాస్టార్ చిరంజీవి.. కేవలం ఓ పేరు కాదు..బ్రాండ్. సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు ఆయనే ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యారు. ఈ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఎన్నో అడ్డంకులు.. ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అవమానాలను భరించి స్వయంకృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

Video Advertisement

 

 

తన నటన.. డ్యాన్స్‏తో సినీప్రియులను అలరించి సుప్రీం హీరో అనే అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. మాస్ యాక్షన్, తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయారు. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలనే ఎంతోమంది యువతరానికి ఆదర్శంగా నిలిచారు చిరు. ఇక కొంతకాలం సినిమాలకి విరామం తీసుకున్న చిరు ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు చిరు.

chiru about waltair veerayya movie..!!

అయితే చిరంజీవికి దర్శకత్వంపై ఆసక్తి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని ఉందని గతంలో చిరంజీవి చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ ఆశ తీరకపోయినా.. సినిమా మొత్తం కాకపోయినా సినిమాలోని కొన్ని సీన్లకు చిరంజీవి దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి వెల్లడించారు.

the scene which chiranjeevi directed in bigboss movie..!!

చిరంజీవి హీరోగా 1995లో ‘బిగ్ బాస్’ అనే సినిమా వచ్చింది. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి ఎస్‌ఐగా నటించారు. ఈ చిత్రంలో అయ్యప్ప మాలలో ఉన్న హీరో పట్ల ఎస్‌ఐ అనుచితంగా ప్రవర్తిస్తాడు. దీంతో హీరోకి ఆగ్రహం వస్తుంది. ఎస్ఐ‌ను చితక్కొడతాడు. ఈ సీన్‌ను మెగాస్టార్ చిరంజీవే డైరెక్ట్ చేశారట. ఈ విషయాన్ని తనికెళ్ళ భరణి తన యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించారు.

” ‘కుక్కకాటుకి చెప్పు దెబ్బ’ అనే సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి ని మొదటిసారి కలిసాను. తరవాత ఆయనతో చాలా సినిమాలు చేశాను. అయితే ‘బిగ్ బాస్’ మూవీ సమయం లో బాపినీడు గారి ఫ్రెండ్‌కి ఒంట్లో బాగోలేకపోతే ఆయన వెళ్లిపోయారు. డేట్స్ లేని కారణంగా చిరంజీవి గారే ఆ సీన్లకు దర్శకత్వం వహించారు. హీరోగా ఉంటూ అంత టెక్నాలజీ నేర్చుకోవడం గొప్ప విషయం’ అని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read: “నరసింహనాయుడు” సినిమాలోని ఈ డైలాగ్ వెనుక… ఇంత పెద్ద కథ ఉందా..?


End of Article

You may also like