Ads
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సాయం అందించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటి నుంచో చిరు పలు చారిటబుల్ ట్రస్ట్ లు కూడా నడుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యం తో ఉన్న పలువురు నటీనటులకు చిరు హెల్ప్ చేసిన విషయం మనకు తెలిసిందే.
Video Advertisement
తాజాగా చిరంజీవి ఓ ప్రముఖ నటుడికి సాయం చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. అతడు ఎవరో కాదు తమిళ నటుడు పొన్నాంబళం. విలన్‌గా తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈయన రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా నటించారు. తెలుగులోనూ ఈయన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో విలన్‌గా రాణించారు.
కోలీవుడ్‌లో తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పొన్నాంబళం అనుకోకుండా సినిమాల నుంచి తప్పుకున్నారు. తర్వాత 2018లో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో పొన్నాంబళం పాల్గొన్నారు. అయితే, రెండేళ్ల క్రితం పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రిటీల సాయం కోరారు. అప్పుడు ఆయనకి సాయం చేయడానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి చాలా మంది ముందుకొచ్చారు.
రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక, ధనుష్, కెఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్ తదితర నటులు పొన్నాంబళానికి ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడి విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడారు. తన స్నేహితుడి ద్వారా చిరంజీవి ఫోన్ నంబర్ సంపాదించిన పొన్నాంబళం ‘ అన్నయ్య నాకు బాగోలేదు.. మీకు చేతనైనంత సాయం చేయండి’ అని మెసేజ్ పెట్టారట. మెసేజ్ చేసిన పది నిమిషాల తర్వాత పొన్నాంబళంకి చిరంజీవి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని పొన్నాంబళం స్వయంగా వెల్లడించారు.
చిరంజీవి తనకు చేసిన సాయం గురించి బిహైండ్‌వుడ్స్ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు పొన్నాంబళం. ” హాయ్ పొన్నాంబళం.. ఎలా ఉన్నావు.. ఆరోగ్యం బాగాలేదా.. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా.. నేను ఉన్నాను, కంగారుపడకు.. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావా అని చిరంజీవి నన్ను అడిగారు. నేను రాలేను అన్నయ్య అని చెప్పాను. అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లండి.. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు.
అక్కడికి వెళ్తే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. అక్కడే నాకు వైద్యం అందించారు. రూ.45 లక్షలు ఖర్చయ్యింది. మొత్తం ఆయనే చూసుకున్నారు. చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు.” అని భావోద్వేగానికి గురయ్యారు పొన్నాంబళం. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని..ఇప్పుడు కూడా సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని.. తండ్రి, అన్నయ్య ఇలా ఏ పాత్ర ఇచ్చినా నటించడానికి సిద్దంగా ఉన్నానని.. చెప్పుకొచ్చారు పొన్నాంబళం.
నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే – నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు – అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు
మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023
End of Article