Ads
సినిమాలో హీరో హీరోయిన్లకు సమాన ప్రాధాన్యత ఉంటుందని అంటూ ఉంటారు కానీ రియల్ లైఫ్ లో వచ్చేసరికి అది మారిపోతూ ఉంటుంది. హీరోల కెరీర్ ఎక్కువకాలం ఉంటుంది కానీ హీరోయిన్ కి ఒక్కసారి వివాహం అయిందంటే ఇక వారి కెరీర్ అక్కడితో ముగిసి పోయినట్టే.
Video Advertisement
ఎందుకంటే పెళ్లయిన హీరోయిన్ ని తమ సినిమాలోకి తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ తీసుకున్నా.. తల్లి పాత్రలు లేక హీరోలకు సోదరి వంటి పాత్రలే వస్తాయి.. మరి కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి అయ్యాక సంసార బాధ్యతలు తీసుకొని పూర్తిగా ఇంటికే పరిమితం అవుతూ ఉంటారు.
ఇప్పుడు ఆ లిస్ట్ లో ఉన్న నటీమణులు ఎవరో చూద్దాం..
#1 నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు ని వివాహం చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం మహేష్ సినిమాలకు సంబంధించిన పనులను చూసుకుంటూనే.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
#2 అసిన్
పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అసిన్ మైక్రోమాక్స్ సంస్థ సీఈవో అయిన రాహుల్ శర్మ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు అసిన్.
#3 ఊహ
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ఊహ..1997 లో హీరో శ్రీకాంత్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు.
#4 కీర్తి రెడ్డి
పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రంద్వారా గుర్తింపు పొందిన కీర్తి రెడ్డి. పలు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. వివాహం తర్వాత ఈమె సినిమాలకు దూరం అయ్యారు.
#5 రేణు దేశాయ్
పవన్ కళ్యాణ్ ని వివాహం చేసుకున్న రేణు దేశాయ్.. ఆ తర్వాత నటనకు దూరం గా ఉన్నారు.
#6 లయ
పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన లయ పెళ్లి చేసుకొని అమెరికా లో స్థిరపడిపోయింది.
#7 రంభ
చిరంజీవి, బాల కృష్ణ వంటి స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రంభ వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు.
#8 శిల్పాశెట్టి
నటి శిల్పా శెట్టి వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా ని 2009 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నటనకు దూరం గా ఉన్నారు.
#9 అన్షు
మన్మధుడు, రాఘవేంద్ర వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అన్షు వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు.
#10 మాధవి
పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మాధవి.. వివాహం తరువాత అమెరికా లో స్థిరపడి.. సినిమాలకు దూరం అయ్యారు.
#11 శాలిని
మలయాళ, తమిళ సినీ పరిశ్రమలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన షాలిని హీరో అజిత్ ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు.
#12 రాధ
250కు పైగా సినిమాలలో నటించిన అలనాటి అందాల తార రాధ బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయ్యారు.
#13 అంజలా జవేరి
ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలా జవేరి.. వివాహం తర్వాత సినిమాలకు దూరం గా ఉన్నారు.
#14 ముచ్చర్ల అరుణ
సీతాకోక చిలుక, చంటబ్బాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ముచ్చర్ల అరుణ వివాహం చేసుకొని అమెరికా లో స్థిరపడ్డారు.
End of Article