“గుంటూరు కారం” సినిమాకి హైలైట్ అవ్వబోయేది ఇదేనా..?

“గుంటూరు కారం” సినిమాకి హైలైట్ అవ్వబోయేది ఇదేనా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న మూడవ చిత్రం #SSMB వర్కింగ్ టైటిల్ తో మొదటి షెడ్యూలు జరుపుకుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న సాయంత్రం ప్రకటించారు.

Video Advertisement

మహేష్ బాబు 28 వ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనికి ‘హైలీ ఇన్ఫ్లేమ్మబుల్’ అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. టైటిల్ తో పాటు ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా గురించిన మరో వార్తా వినిపిస్తోంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై మరింత ఆసక్తిని   పెంచింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న టైటిల్ తో పాటుగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే మూవీ దుమ్ము లేపడం పక్కా అన్నట్టుగా ఉంది. మహేష్ బాబు మాస్ స్ట్రైక్ బాక్సాఫీస్ ని ఈసారి గట్టిగానే ఢీ కొట్టేట్టు ఉందని అంటున్నారు. గుంటూరు మిర్చి కారం ఎంత ఘాటు ఉంటుందో గ్లింప్స్ తో శాంపిల్ చూపించారు.
పోకిరి మూవీలో సిగరెట్ తాగుతూ కనిపించిన ప్రిన్స్, ఈ మూవీలో మళ్ళీ సిగరెట్ తో ఊర మాస్ గా కనిపించారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ గ్లింప్స్ లో ఫైట్ సీన్ కనిపించింది. అయితే తాజా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ ఫైట్ ఎపిసోడే ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్నిఎస్ రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా,  శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని  వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.

Also Read: “ఇంక మెసేజ్ లు లేవు… మాస్ మాత్రమే..!” అంటూ… మహేష్ బాబు “గుంటూరు కారం” మాస్ స్ట్రైక్ వీడియోపై 15 మీమ్స్..!

 


End of Article

You may also like