Ads
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి. అలాంటి దర్శక ధీరుడి తో సినిమా చేయడానికి దేశం మొత్తం మీద ఉన్న అందరు స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
అయితే తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తీసి టాలీవుడ్ కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చాడు రాజమౌళి. అయితే రాజమౌళి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యలేదు. రాజమౌళి తన కెరియర్ లో బెస్ట్ సినిమా గా చెప్పుకునే విక్రమార్కుడు సినిమా పవన్ కళ్యాణ్ తో చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఆ సినిమా చెయ్యడం కుదర్లేదు.
అలాగే మహేష్ బాబు తో కూడా రాజమౌళి ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా తియ్యలేదు. ప్రస్తుతం ఒక సినిమా ప్రకటించారు. అయితే మహేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాజమౌళి ఒక మూవీ తియ్యాలి అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో మూవీ గురించి 13 ఏళ్ళ క్రితం రాజమౌళికి ఒక ట్విట్టర్ యూజర్ నుంచి ప్రశ్న వచ్చింది.
దానికి సమాధానంగా రాజమౌళి..” మహేష్, పవన్ కాంబినేషన్ లో మూవీ అనేది ఒక కల లాంటిది. ఈ కాంబినేషన్ కోరుకోవడం టూ మచ్..” అంటూ ట్వీట్ చేసారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ రావాలి అంటే త్రివిక్రమ్ లేదా రాజమౌళి వీరిద్దరిలో ఒకరే తియ్యగలరు. ఇప్పటికే జల్సా మూవీకి మహేష్ తో వాయిస్ ఓవర్ ఇప్పించాడు త్రివిక్రమ్. అలాగే వీరిద్దరికి త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా..
పవన్- మహేష్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ కాంబినేషన్ లో మూవీ ఇంపాజిబుల్. ఒకవేళ అలాంటి కథ దొరికినా.. వీరిద్దరిని బాలన్స్ చెయ్యకపోతే థియేటర్స్లో విధ్వంసమే. ఒకేవేళ అలాంటి చిత్రం తీస్తే అది బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది డికేడ్ అవుతుంది. మరి త్రివిక్రమ్, రాజమౌళి లో ఎవరైనా ఈ మూవీ తీసే ఆలోచనలో ఉన్నారో లేదో..
Also read: ఏంటి బాసు ఇది.? “గాడ్ ఫాదర్” ఒకటే అనుకుంటే…నెక్స్ట్ 4 కూడా అంతేనా.?
End of Article