చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.

Video Advertisement

కానీ గాడ్ ఫాదర్ ఫ్యాన్స్ ని మాత్రం నిరాశ పరచలేదని చెప్పాలి. దీని ముందు వచ్చిన ఆచార్య సినిమా మాత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి.

god-father-ott-release-update

ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. అలాగే చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు హిట్ టాక్ వస్తోంది. చిరంజీవి ఫ్యాన్స్ అందరు ఖుష్ అయ్యిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మనం చూసేసాం. ఈ సినిమా తమిళ్ లో అజిత్ కుమార్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.

minus points in god father..!!

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గారి కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భీష్మ పర్వం సినిమా రైట్స్ తీసుకున్నారు. ఇది మలయాళం సినిమా. అయితే మెగాస్టార్ చిరంజీవి మొత్తం నాలుగు రీమేక్ చిత్రాలలో నటిస్తున్నారు. మరి ఆ సినిమాల గురించి ఇప్పుడు చూసేద్దాం.

#1. భీష్మ పర్వం:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భీష్మ పర్వం సినిమా రైట్స్ తీసుకున్నారు. ఇది మలయాళం సినిమా. ఇందులో చిరు నటించనున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

#2. భోళా శంకర్:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ లో అజిత్ కుమార్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు

#3. కొరియన్ సినిమా:

chiranjeevi faces troubles in 2nd innings

ఇది కూడా ఓ రీమేక్ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి డాన్ లాగ కనపడనున్నారు.

#4. ఎన్నై అరిందాల్:

మెగాస్టార్ చిరంజీవి ఎన్నై అరిందాల్ రీమేక్ సినిమాలో కూడా నటించనున్నారు.