Ads
స్టార్ హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఏప్రిల్14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
Video Advertisement
‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే ఊహించని విధంగా ఈ మూవీ ప్లాప్ అయ్యింది. అయితే ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా జవాబు దొరికే కోరాలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
“శాకుంతలం చిత్రంపై మీ సమీక్ష ఏంటి..” అనే ప్రశ్న వచ్చింది కోరా లో.. దానికి లలిత ఊరకరణం అనే యూజర్ ఫన్నీ గా ఆన్సర్ ఇచ్చారు. ” ఈ సినిమా తీసిన వాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనుకుంటా.. అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో బోలెడన్ని గ్రాఫిక్స్ జంతుజాలం ఉంటాయి. ఆశ్రమ జీవన విధానం అంటే మరీ ప్రతి ఫ్రేమ్ లో ఇరుక్కొని అన్ని జంతువులు ఉండాలా అని అనుమానం కూడా వచ్చింది.
ఇక ఈ సినిమా మొత్తం పాపం ఆ గ్రాఫిక్స్ ఉద్యోగుల కష్టమే అనిపిస్తుంది. సమంత గారి పరిచయ దృశ్యం నుంచి.. గ్రాఫిక్స్ సీతాకోక చిలుకలని ఎగర కొట్టడానికి మన హీరో గారు సమంత పాదాల దగ్గర నుండి బాణంతో నిటారుగా ఓ CGI పూవుని పైకి వదిలే సరికి అవన్నీ పైకి ఎగిరిపోయి సమంత గారి సుందర వదనం హీరో గారికి దర్శనం ఇస్తుంది. పోనీ ఈ గ్రాఫిక్స్ సంగతి పక్కన పెడితే శకుంతల కథ అంటేనే ఒక అద్భుత ప్రేమ కావ్యం.
కానీ సమంత అంతటి నటీమణిని తెచ్చుకున్నప్పుడు సాధారణమైన ప్రేమ కథ రాసేస్తే సరిపోదు కదా.. అందుకే దుష్యంతుడు ప్రేమిస్తున్నా అని చెప్తే ‘ అమ్మా నాన్న ల ప్రేమ కి దూరమైన నేను…’ అంటూ ఏదో చెప్తుంది. ఆ డైలాగ్స్ కి ఆమె హావభావాలకి సంబంధం ఉండదు. కాళిదాసు గారు రాసిన అభిజ్ఞాన శాకుంతలంలో, పిన వీరభద్రుడు గారు రాసిన శృంగార శాకుంతలంలో ఇలా లేనట్టు గుర్తు నాకు.
ఇక కథ క్లైమాక్స్ కి వచ్చేసరికి.. ఉంగరం చూశాక శకుంతల గుర్తొచ్చిన దుష్యంతుడు మద్య పానం చేస్తూ అర్జున్ రెడ్డి మోడ్ లోకి వెళ్తాడు. కానీ ఈ మూవీలో దుష్యంతుడు వేసుకునే దుస్తులు మాత్రం కలర్ఫుల్ గా ఉన్నాయి. చిన్నపిల్లల డ్రెస్సుల్లాగా.. ఇక సమంత జుట్టుకు తగిలించిన మొగ్గల దండలని చూస్తే, తల్లో పేలు గుర్తురాక మానదు. ఇక మధ్యలో మధుబాల, ప్రకాష్ రాజ్, ఆ కాలనేమి రాక్షసుల గోల.
భరతుడిగా వేసిన బుజ్జి పాప అర్హ ముద్దుగా నటించింది. ఈ సినిమాని అంత భారీ ఖర్చుతో, భారీ తారాగణంతో కాకుండా చక్కగా కొత్త తారలతో తక్కువ బడ్జెట్ లో ఓటీటీ కోసం తీసినా బాగుండేది. నా వరకు అయితే ప్రియంవద గా చేసినమ్మాయి శకుంతల పాత్ర చేస్తే బాగుండేది.” అని లలిత ఊరకరణం శాకుంతలం సినిమాని విశ్లేషించారు.
Also read: ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..? ఏంటి దీని కథ..?
End of Article