ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..? ఏంటి దీని కథ..?

ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..? ఏంటి దీని కథ..?

by kavitha

Ads

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మలయాళ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కు దగ్గర అయ్యారు. స్ట్రైట్ తెలుగు చిత్రాలలోను మ‌మ్ముట్టి నటించారు.

Video Advertisement

మ‌మ్ముట్టి క‌మ‌ర్షియ‌ల్ ట్రెండ్ కి భిన్న‌మైన స్టోరీస్ ను, క్యారెక్టర్లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే మరో ప్ర‌యోగాత్మ‌క స్టోరీతో మ‌మ్ముట్టి ఆడియెన్స్ ముందుకి వచ్చారు. అదే నాన్ ప‌క‌ల్ నేర‌త్తు మ‌యక్కం సినిమా. ఈ చిత్రం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Nanpakal-Nerathu-Mayakkam-movie1మలయాళ స్టార్ మ‌మ్ముట్టి  హీరోగా జ‌ల్లిక‌ట్టు డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మ‌ల‌యాళ, తెలుగు బాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని  ఫిలాస‌ఫిక‌ల్ పాయింట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా కథ జేమ్స్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.
జేమ్స్ అనే వ్యక్తి  వేలంకిని మాత ద‌ర్శ‌నానికి త‌న భార్యాపిల్ల‌లు మరియు బంధువుల‌తో క‌లిసి వెళ‌తాడు. అక్కడి నుండి బస్ లో తిరిగి వచ్చేటపుడు త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఒక ఊర్లో దిగిన జేమ్స్, నేరుగా ఒక ఇంటిలోకి వెళ‌తాడు. తెలుగు వ్యక్తి అయిన జేమ్స్ అప్పటి నుండి త‌మిళంలో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆ పల్లెటూరులోని అందరిని వారి పేర్లతో ప‌ల‌క‌రిస్తూ, త‌న ఊరు అదే అని చెబుతాడు.
ఆ ఊరి నుండి 2 సంవత్సరాల క్రితం మిస్ అయ్యిన సుంద‌రంలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. జేమ్స్‌లో సడెన్ గా వ‌చ్చిన ఆ మార్పుకు కారణం ఏమిటి అనేది జేమ్స్ భార్య, బంధువులతో పాటు ఆ ఊరివాళ్ల‌కు అర్ధం కాదు. జేమ్స్ ను తీసుకెళ్ల‌డానికి భార్య, బంధువులు ఎంత ప్రయత్నించినా జేమ్స్ అంగీకరించడు. జేమ్స్ అస‌లు ఎందుకు అలా మారాడు? సుంద‌రంగా మారిన జేమ్స్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?
జేమ్స్ త‌న గ‌తాన్ని తెలుసుకొని భార్యాపిల్ల‌లతో కలిసి వెళ్లాడా? లేదా సుంద‌రంగా ఆ ఊరిలోనే ఉండిపోయాడా అనేదే మిగతా స్టోరి. మ‌మ్ముట్టి అటు జేమ్స్‌ గా, ఇటు సుంద‌రంగా 2 క్యారెక్టర్లలోనూ జీవించాడు. ఈ రెండు పాత్రలలో మ‌మ్ముట్టి యాక్టింగ్, వేరియేష‌న్స్ అద్భుతం.

Also Read: బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమాకి ముందు అనుకున్న టైటిల్ ఏదో తెలుసా..?


End of Article

You may also like