నందమూరి బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బాలయ్య 108వ చిత్రం టైటిల్ ను  మూవీ యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ కు ‘ఐ డోంట్ కేర్’ అని ట్యాగ్ ఇచ్చారు.

Video Advertisement

ఈ చిత్రంలో బాలకృష్ణను డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంతకుముందు ఎప్పుడూ చూడని పాత్రలో చూపించబోతున్నట్టు  తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ లానే, పోస్టర్ కూడా అందరిని ఆకర్షిస్తుంది. అయితే ఈ చిత్రానికి ముందుగా భగవంత్ కేసరి కాకుండా వేరే టైటిల్ అనుకున్నారంట. మరి ఆ టైటిల్ ఏమిటో? ఎందుకు పెట్టలేదో ఇప్పుడు చూద్దాం..
bhagavanth-kesari-title-poster-1నట సింహం బాలకృష్ణ 108వ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి  బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు అభిమానుల్లో ఏర్పడింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందని టాక్. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంటో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.
టైటిల్‍ను డిఫరెంట్ గా ప్రకటించాలని ప్లాన్ చేసిన చిత్రబృందం, రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో 108 హోర్డింగ్‍లను పెట్టి మూవీ టైటిల్ ను ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ భగవంత్ కేసరి కాదంట. ‘బ్రో ఐ డోంట్ కేర్’ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీకి టైటిల్ ‘బ్రో’ అని ఫిక్స్ చేశారు. దాంతో ఆ టైటిల్ ను పక్కనపెట్టి  ‘భగవంత్ కేసరి’ ఫైనల్ చేశారంట.

Also Read: ఈ కారణం వల్లే ఆదిపురుష్ టీమ్ ఇంటర్వ్యూ లకి దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యారా..?