Ads
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం… ఆలయం వెలుపల కథానాయిక కృతి సనన్ని, ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఓం రౌత్, కృతి సనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Video Advertisement
దర్శనం అనంతరం కృతి సనన్ వెళ్లిపోతున్నా సమయంలో ఓం రౌత్ ని కౌగిలించుకోవడం, ఓం రౌత్ ఆమెకు ముద్దు ఇవ్వడం పై భక్తులు, హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నారు. ఆలయం ఆవరణలో చెప్పులు వేసుకుని నడవడమే తప్పుగా భావించే భక్తులు, ఈ సన్నివేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం పై హిందీ ‘రామాయణ్’ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిక్లియా స్పందించారు.
” సీత పాత్ర అనేది ఓ ఎమోషన్. ఆ పాత్ర వేసే అవకాశం రావడమే ఓ అదృష్టం. ఆ పాత్రలో జీవించినప్పుడే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. కానీ నేటి తరం హీరోయిన్లలో అది కొరవడింది. ఏ పాత్ర వేసినా.. దానిని నటనగానే భావిస్తున్నారు. నేను రామాయణంలో సీత పాత్ర వేసిన తర్వాత కొన్నేళ్ల వరకూ తనను చాలా మంది సీతగానే భావించారు.
బయటకు వెళితే చాలా మంది తన పాదాలకు నమస్కరించేందుకు వచ్చేవారు.నేటితరం నటులు పాత్ర పోషించినంతసేపే దానిగురించి ఆలోచిస్తున్నారు. పూర్తి కాగానే దానిని మర్చిపోతున్నారని తెలిపారు. ఇందుకు నిదర్శనమే తిరుపతిలో జరిగిన ఘటన.” అని దీపికా అన్నారు.
దీపికా చిక్లియా గతంలో కూడా ఆదిపురుష్ టీజర్‌పై స్పందించారు. 1.46 నిమిషాల నిడివి ఉన్న టీజర్‌లో రావణుడు,హనుమంతుని వర్ణన విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆమె కామెంట్స్ చేసారు. మరో వైపు ఈ అంశంపై చిలుకూరి బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా స్పందించారు. “తిరుమల కొండకు వచ్చినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు సైతం వారి ఆలోచనా విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.” అన్నారు.
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఆదిపురుష్’ సినిమా టీజర్ విడులైనప్పటి నుంచీ వివాదాస్పదమైంది. ఇప్పటి వరకు రామాయణంలో పాత్రలను చూసిన ప్రేక్షకులు.. ఈ సినిమాలోని పాత్రలను స్వీకరించలేకపోయారు. ఈ క్రమంలో తిరుమలలో కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన మరోసారి ఈ సినిమా వివాదంలో చిక్కుకునేలా చేసింది.
Also read: ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..? ఏంటి దీని కథ..?
End of Article