14 మంది కలిసి ఒక్కడి మీద పగ బట్టారు.. రాకేష్ మాస్టర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

14 మంది కలిసి ఒక్కడి మీద పగ బట్టారు.. రాకేష్ మాస్టర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

by kavitha

Ads

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. జీవితంలో ఎన్నో కష్టాలు తట్టకుని తన ఆటిట్యూడ్ తో ఉన్నత స్థితికి చేరుకున్న రాకేష్ మాస్టర్, ఆఖరికి ఆ ఆటిట్యూడే అతన్ని అందరికి దూరం అయ్యేలా చేసింది. ఆయన లైఫ్ లో వివాదాలు మాత్రమే కాకుండా ఆదర్శమైన కోణాలు కూడా ఉన్నాయి.

Video Advertisement

రాకేష్ మాస్టర్ 1968లో జన్మించారు. వారి స్వస్థలం నెల్లూరు. తండ్రికి తిరుపతి మార్కెట్ యార్డులో ఉద్యోగం రావడంతో కుటుంబంతి పాటు తిరుపతికి షిఫ్ట్ అయ్యారు. ఏడుగురు పిల్లలలో రాకేష్‌ మాస్టర్‌ కూడా ఒకరు. పెద్ద ఫ్యామిలీ కావడంతో వారి పోషణ కూడా కష్టంగా ఉండేది.rakesh-master సొంత ఇల్లు లేకపోవడంతో ఎన్నో కష్టాల మధ్య పెరిగిన మాస్టర్ చిన్నతనం నుండి ముక్కుసూటిగా మాట్లాడేవారు. స్కూల్ కి పంపించిన చదువు మీద ఆసక్తి లేకపోవడంతో తల్లితో ఉంటూ పని చేసేవాడు. కష్టపడి సొంత ఇల్లు కట్టుకోగలిగారు.రాకేష్ మాస్టర్ కి చిన్నతనం నుండే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎక్కడ సంగీతం వినిపించినా డ్యాన్స్ వేసేవాడు. అది పెళ్లి పాటలకు అయినా, శవాల దగ్గర డప్పుల చప్పుడికి డ్యాన్స్ వేసేవాడు.

ఒక గురువు వద్ద కరాటేతో పాటుగా డ్యాన్స్ లోనూ శిక్షణ తీసుకున్నాడు. డ్యాన్స్ పైన పెరిగిన ఆసక్తితో సినిమాల్లోకి వెళ్లాలని భావించి, డబ్బులు లేకపోయినా, మద్రాస్ ట్రైన్ ఎక్కాడు. అవకాశాలు లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డారు. ప్లాట్ ఫామ్ పైనే కొన్ని రోజులు పడుకున్న మాస్టర్ తిరిగి ఊరెళ్ళాడు. తిరుపతిలో డ్యాన్స్ స్కూల్ పెట్టి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు.
డ్యాన్స్ స్కూల్ కి పేరు రావడం, ఆర్ధికంగా మాస్టర్ నిలదొక్కుకున్నాడు. డబ్బులు రావడంతో సినిమాలలో చేరాలనే పట్టుదలతో మళ్ళీ మద్రాస్ ట్రైన్ ఎక్కాడు. మాస్టర్ మద్రాసులో ఛాన్స్ ల కోసం వెతుకున్న సమయంలో పరిచయం అయిన సుధా అనే మేనేజర్‌ ద్వారా ముక్కు రాజు మాస్టర్ ని రాకేష్ మాస్టర్  కలిశారు. ఆ సమయంలో ముక్కు రాజు మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్. ఆయన వద్ద పద్నాలుగు మంది డ్యాన్సర్లు ఉండేవారు. రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని కలిసిన తరువాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.కమల్ హాసన్ సాగర సంగమం సినిమాలో  వేసిన డ్యాన్స్ స్టెప్స్ ని వేసి రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని ఇంప్రెస్ చేశారు. ఆ తరువాత ముక్కు రాజు మాస్టర్ రాకేష్ మాస్టరుని తన దగ్గర ఉన్నపద్నాలుగు మంది డ్యాన్సర్లకు హెడ్ ని చేశారు. కానీ రాకేష్ మాస్టర్ ఎదుగుదలను చూసి తట్టుకోలేని ఆ పద్నాలుగు మంది డ్యాన్సర్లు ఆయన పై పగ పట్టారు. అయినా కూడా  రాకేష్ మాస్టర్ తన ప్రవర్తనను మార్చుకోకుండా ఆ డ్యాన్సర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత గురువు ముక్కు రాజు మాస్టర్ చెప్పిన సలహాతో వేరే ప్రాంతానికి వెళ్లిన మాస్టర్, డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టి బాగా పాపులర్ అయ్యాడు. వేణు హీరో అవకుముందు రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. తాను హీరో అయిన తరువాత చిరునవ్వుతో సినిమా కోసం రాకేష్ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా చేశారు. అందులో ‘నిన్నలా మొన్నలా’ అనే పాటకు కొరియోగ్రాఫి చేశారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ పాటతో రాకేష్ మాస్టర్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆయన 1500 సినిమాలకు కొరియోగ్రాఫి చేశారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే.

Also Read : “రాకేష్ మాస్టర్” తండ్రి ఎంత గొప్పవారో తెలుసా..? అప్పట్లోనే ఇంత ఆలోచించారా..?


End of Article

You may also like