Home Human angle నార్మల్ డెలివరీ అయ్యాక ఆడవాళ్ళు అస్సలు చేయకూడని పనులు ఏవో తెలుసా..?

నార్మల్ డెలివరీ అయ్యాక ఆడవాళ్ళు అస్సలు చేయకూడని పనులు ఏవో తెలుసా..?

by Sainath Gopi

తల్లిగా ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళ యొక్క జీవితంలో అద్భుతమైన క్షణాలని చెప్పవచ్చు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. దేనితోనూ పోల్చలేనిది. అయితే ప్రసవం తర్వాత స్త్రీలలో ఎన్నో మార్పులు వస్తాయి.

ఆ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి లోనవుతారు. డెలివరీ సమయంలో రక్తం కోల్పోవడం, స్ట్రెస్ వంటి వాటి వల్ల మహిళలు మరింతగా నీరసించి పోతారు. అందువల్ల డెలివరీ అయిన తరువాత చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. women-recovery-after-delivery-2డెలివరీ తరువాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయి. శారీరక పెయిన్స్ ఉంటాయి. డెలివరీ నుండి కోలుకోవాలంటే మానసిక స్థైర్యం చాలా ముఖ్యం. సింపుల్ గా అనిపించినా ఇది  ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మహిళల ఆలోచనలే వారి శరీరంలో  హార్మోన్స్  మార్పులకు కూడా కారణం అవుతాయి. కాబట్టి డెలివరీ అయ్యక ఒత్తిడికి గురి కాకూడదు. స్థిమితంగా ఉండాలి. నాకు మాత్రమే ఎందుకు ఈ సమస్య అనుకోవద్దు. నేను ఇలాగే పుట్టానని, అందరికి పిల్లలు పుట్టారని, వారు కూడా ఇలాగే పెరుగుతారని అనుకోవాలి. బేబీ కేర్ పై దృష్టి పెట్టాలి. అన్నిటికీ ఇంటర్నెట్ సహాయం తీసుకోవద్దు. ప్రతి దానికి భయపడకూడదు.  అలా అని చెప్పి పిల్లల్ని బయట తిప్పకూడదు. సమయానికి పడుకోవాలి. అది కూడా బేబీ పడుకున్న సమయంలోనే పడుకోవాలి. లోకంలో అందరు ఇలానే ఉంటారని అనుకోవాలి.ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే బిడ్డ విషయంలో కాస్త దైర్యంగా ఉంటుంది. కాబట్టి డెలివరీ ముందు నుండే మానవ సంబంధాలు పెంచుకోవాలి.
అలా ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడే కొన్ని విషయాలలో నెమ్మది, మరి కొన్ని విషయాలలో సలహాలు, సూచనలు లభిస్తాయి. బిడ్డను ఎలా చూసుకోవాలనే విషయాలు కూడా అనుభవజ్ఞులైన వారు చెబుతూ ఉంటారు. డెలివరీ అయిన మహిళలకు భర్తతో పాటుగా, కుటుంబ సభ్యుల మద్ధతు కూడా దొరికినపుడే వారు ఈ సమస్యల నుండి త్వరగా బయటికి రాగలుగుతారు.

Also Read: జీవితంలో ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి “సుధామూర్తి” పాటించిన సూత్రాలు ఏవో తెలుసా..?

You may also like