జీవితంలో ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి “సుధామూర్తి” పాటించిన సూత్రాలు ఏవో తెలుసా..?

జీవితంలో ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి “సుధామూర్తి” పాటించిన సూత్రాలు ఏవో తెలుసా..?

by kavitha

Ads

ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండర్, మానవతా మూర్తి అయిన సుధా మూర్తి అందరికీ సూపరిచితమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ ఐటీ కంపెనీలలో ఒకటి అయిన ఇన్ఫోసిస్ సామాజికంగా కూడా అనేక పనులు చేస్తోంది. ఇలా చేయడానికి కారణం సుధా మూర్తి.

Video Advertisement

సుధా మూర్తి ఆలోచనా తీరు, సమాజం పట్ల ఉన్న చింతన, ఆదర్శ భావాలు అందరికి మార్గదర్శకం అని చెప్పవచ్చు. అవి ఎలా జీవించాలో చెబుతాయి. ఫ్యామిలీ, వృత్తిపరమైన జీవితాలను బ్యాలెన్సింగ్‌ చేయడంతో పాటు జీవన విధానం అనేది ఎలా ఉండాలి అనే విషయం గురించి సుధా మూర్తి కొన్ని సూత్రాలను పాటించారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.. Sudha-Murthyఇండియాలో అత్యంత ధనికులలో ఒకరు అయిన సుధా మూర్తి చాలా సాధారణంగా ఉంటారు. ఆమె తన సింప్లిసిటీతో అందరి మనసులను గెలుచుకున్నారు. అంతేకాకుండా ఆమె సాధించిన విజయాలు ఇతరులకు స్పూర్తిగా నిలిచాయి. మనిషి ఎంత ఎదిగినా సంతోషంగా జీవించాలంటే ఎలా ఉండాలనే దాని గురించి ఆమె తన లైఫ్ లో పాటించిన సూత్రాలను ఇతరులకు కూడా చెబుతున్నారు.

  • భార్యభర్తలిద్దరు ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటే వారి జీవితం సంతోషమయం అవుతుంది. ఫ్యామిలీ విషయాలలో ఇద్దరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే తమ లక్ష్యాలను కూడా చేరుకోవచ్చు. దంపతులు
    పర్సనల్ గా ఆలోచించడమే కాదు, ఫ్యామిలీ ఎదుగుదల గురించి ఆలోచించాలి.
  • మనసులో వచ్చే అభిప్రాయాలు, ఆలోచనలను ఏ పరిస్థితుల్లో అయినా దాచవద్దు. మీ అభిప్రాయం గురించి చెప్పడమే కాకుండా వారి అభిప్రాయాలను సైతం తీసుకోవాలి. ఫ్యామిలీలో ఉన్న అందరితో సంతోషంగా ఉండాలి.
  • ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషులిద్దరు కూడా జాబ్, బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఇంటి పనులు మాత్రం మర్చిపోతున్నారు. కానీ అలా చేయకూడదు. పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటూ, దానిని కాపాడుకోవాలి.

  • చేసే పనుల ద్వారా ఇతరులకు మేలు కలిగేలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. అప్పుడే సొసైటీలో అందరు మంచిగా బ్రతకగలరు.
  • విజయాల కోసం ఒకరినొకరు అనుసరించాలనేది వాస్తవం. అలా అని ఎదుటివారిలా పూర్తిగా మారలేము.  మనం ఎల్లప్పుడూ మనలాగానే ఉండాలి. మొదటి నుండి పాటిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని, సరళత్వాన్ని విడిచిపెట్టకూడదు. సొంత సామర్థ్యాల మీద నమ్మకం ఉంచాలి. సొంత నిర్ణయాలు తీసుకోవాలి.
  • సుధామూర్తి ఎక్కువగా తనను తాను నమ్ముకుంది. ఆమె తన ఫ్యామిలిని అంతే సమానంగా ప్రేమించింది. అలాగే తన వర్క్ లో నిమగ్నమైంది. ఏ విషయంలో అయినా ఆమె తన ఫ్యామిలీకి ప్రధమ స్థానం ఇచ్చేవారు.
  • మనిషికి విలువలు అనేవి ఎంతో ముఖ్యం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి. అలాగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అందరూ బాగుండాలని కోరుకోవాలి.

Also Read: తండ్రి చనిపోయినా… ఆయన కలను నెరవేర్చిన మహిళా క్రికెటర్ “రేణుకా ఠాకూర్‌” గురించి ఈ విషయాలు తెలుసా.?


End of Article

You may also like