Ads
హీరోలు అన్న తర్వాత పోటీ ఉంటుంది. ఒకే ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి సినిమాలు వస్తున్నాయి అంటే ఎవరి హీరో సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనే చర్చలు జరుగుతాయి. అందుకే ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతాయి. సోషల్ మీడియాలో, “మా హీరో గొప్ప” అంటే, “మా హీరో గొప్ప” అంటూ తిట్టుకుంటూ ఉంటారు. కానీ మరొక పక్క హీరోలు అందరూ కూడా బాగానే ఉంటారు. వాళ్ళందరి మధ్య ఆరోగ్యకరమైన కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. సినిమాలు అయిపోతే సాధారణమైన జీవితంలో వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఒకరి పుట్టినరోజులకి ఒకరు విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. ఫంక్షన్స్ లో కలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక విషయం మీద జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మీద కామెంట్స్ వస్తున్నాయి.
Video Advertisement
వాళ్ళ ముగ్గురు ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ల మీద కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడం. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందుకు సోషల్ మీడియా ద్వారా చాలా మంది నటులు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తూ కామెంట్స్ చేశారు. నాని, రాజ్ తరుణ్, చిరంజీవి, రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఓటు వేయండి అంటూ పోస్ట్ లు షేర్ చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మాత్రం ఈ విషయం మీద కామెంట్స్ చేయలేదు. మహేష్ బాబు, అల్లు అర్జున్ మామూలుగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. చాలా సార్లు మహేష్ బాబు తనకి రాజకీయాలు అంటే అసలు ఆసక్తి లేదు అని, దాని గురించి తను మాట్లాడదలచుకోవట్లేదు అని చెప్పారు.
వందేళ్లు వచ్చినా కూడా తను సినిమాలు మాత్రమే చేస్తాను అని అన్నారు. రాజకీయ నాయకులు తనకి స్నేహితులుగా ఉన్నా కూడా వారి పుట్టినరోజుకి విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తారు కానీ, రాజకీయాలకి సంబంధం ఉన్న విషయం మీద కామెంట్స్ మాత్రం చేయలేదు. అల్లు అర్జున్ కూడా ఇంతే. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, రాజకీయాలు ఉన్న కుటుంబానికి చెందినవారు. అయినా కూడా గత కొంత కాలం నుండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో వీళ్ళ ముగ్గురు ఈ విషయం మీద స్పందించలేదు.
అల్లు అర్జున్ ఆర్య 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సెలబ్రేషన్స్ పనిలో ఉన్నారు. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇలా వీళ్లంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి పవన్ కళ్యాణ్ తో మంచి స్నేహం ఉంది. అయినా కూడా వీళ్లు రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. అయినా కూడా, స్నేహం కారణంగా ఏదైనా ఒక పోస్ట్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వేస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతూ కామెంట్స్ చేశారు.
End of Article