మొత్తం సినిమా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?

మొత్తం సినిమా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?

by Harika

Ads

క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తీయడంలో మలయాళం దర్శకులు ముందు ఉంటారనే విషయం తెలిసిందే. మలయాళంలో రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ‘ఇరట్టా’. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి నటించింది.

Video Advertisement

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇతర భాషల్లో మంచి టాక్ ఉన్న సినిమాలు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయా ? అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇరట్టా మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో  వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్‌ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్‌ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేష‌న్‌లో వినోద్ చ‌నిపోయే సీన్‌తోనే మూవీ  ప్రారంభం అవుతుంది. ఆ త‌ర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్‌తో వారికున్న గొడ‌వ‌ల‌ గురించి చెప్ప‌డం. ఫ్లాష్‌బ్యాక్ తో వినోద్ హ‌త్య‌ వెనుక కార‌ణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది. Iratta-Movie-Reviewఆఖరికి వినోద్‌ను ప్ర‌మోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్ట‌రీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహ‌ల‌కు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్‌ ఈ మూవీని నిర్మించారు. డ్యూయ‌ల్‌లో రోల్‌లో  జోజు జార్జ్ న‌ట విశ్వ‌రూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండ‌దు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యుల‌ర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మ‌న‌సుల నుండి సుల‌భంగా పోదు.

Also Read : ప్రభాస్‌ “కల్కి 2898 AD” గ్లింప్స్‌ లో కనిపించిన… ఈ నటుడు ఎవరో తెలుసా..?


End of Article

You may also like