ప్రభాస్‌ “కల్కి 2898 AD” గ్లింప్స్‌ లో కనిపించిన… ఈ నటుడు ఎవరో తెలుసా..?

ప్రభాస్‌ “కల్కి 2898 AD” గ్లింప్స్‌ లో కనిపించిన… ఈ నటుడు ఎవరో తెలుసా..?

by kavitha

Ads

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ మూవీ టైమ్‌ట్రావెల్‌ మరియు సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో దీపికా పదుకోనే కథానాయకగా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Video Advertisement

ఈ మూవీ మేకర్స్ ‘కామిక్‌ కాన్ –2023’ వేడుకల్లో టైటిల్‌, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌ కి ప్రభాస్ అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ గ్లింప్స్‌ తో మూవీ పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ గ్లింప్స్‌ లో ఒక తమిళ నటుడు నెటిజెన్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ నటుడి గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘కల్కి 2898 ఏడి’ గ్లింప్స్‌ లో కనిపించిన కోలీవుడ్ యాక్టర్ పేరు పశుపతి. ఇతను తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు. తమిళంలో అనేక సినిమాలలో నటించి, మెప్పించాడు. పశుపతి నటించిన చాలా పాత్రలకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రధాన పాత్రలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కామెడీ పాత్రలలో నటించిన విలక్షణ నటుడు పశుపతి.
పశుపతి చెన్నైలోని వన్నందురైలో 1967లో జన్మించారు. 1984లో, చెన్నైలోని ” కూత్తు-పి-పట్టరై ” అనే థియేటర్ గ్రూప్‌లో చేరాడు. సినిమాల్లో నటించడం మొదలుపెట్టేవరకు అక్కడే ఉన్న పశుపతికి, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న యాక్టర్ నాజర్‌తో స్నేహం ఏర్పడింది. నాజర్ ద్వారా పశుపతి కమల్ హాసన్‌కి పరిచయం అయ్యాడు. అలా కమల్ హాసన్ నటిస్తున్న మరుదనాయగంలో విలన్ పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. అదే పశుపతి మొదటి సినిమా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తరువాత వేరే చిత్రాలలో అవకాశాలు రావడంతో నటిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. పశుపతి కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. డైరెక్ట్ తెలుగు సినిమాలలో కూడా నటించారు. మొదటిసారి రవితేజ హీరోగా 2003లో వచ్చిన ‘వీడే’ మూవీలో సీనియర్ నటి నళిని స్వర్ణక్కగా నటించగా, ఆమె తమ్ముడిగా పశుపతి నటించాడు. ఆ తరువాత ఆంధ్రావాలా, నేనున్నాను, అనామిక, మలుపు, రాజా విక్రమార్క పశుపతి నటించారు.

Also Read: ఇలాంటి సమస్యల మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like