“బ్రో” మూవీలో “పవన్ కళ్యాణ్” ఎంతసేపు కనిపిస్తాడంటే..?

“బ్రో” మూవీలో “పవన్ కళ్యాణ్” ఎంతసేపు కనిపిస్తాడంటే..?

by kavitha

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ ’బ్రో‘. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ’వినోదియ సిత్తం‘ మూవీకి రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Video Advertisement

తమిళంలో దర్శకత్వం వహించిన డైరెక్టర్ సముద్రఖనినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ లో సముద్రఖని చేసిన దేవుడి పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ది అతిథి పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంలో పవన్ ఎంతసేపు కనిపిస్తాడో ఇప్పుడు చూద్దాం..
bro-movie‘బ్రో’ మూవీలో పవన్ కళ్యాణ్ టైమ్ గాడ్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో తన పాత్ర చిత్రీకరణను కేవలం 3 వారాల్లో పూర్తి చేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఈ మూవీలో చేసేది గెస్ట్ క్యారెక్టర్ అని ఫ్యాన్స్, నెటిజెన్లు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయం పై సాయిధరమ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో 80‌-90 శాతం వరకు పవన్ కళ్యాణ్ ఉంటాడని తెలిపాడు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ మూవీలో  80‌-90 శాతం వరకు పవన్ కళ్యాణ్ ఉంటాడని తెలిపాడు. సినిమా మొదటి పదిహేను నిమిషాలు పవన్ కళ్యాణ్ లేకుండా స్టోరీ నడుస్తుందని వెల్లడించాడు. ఆ సమయంలో తన పాత్ర పైనే స్టోరీ నడుస్తుందని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. అప్పటి నుండి క్లైమాక్స్ వరకు పవన్ క్యారెక్టర్ కొనసాగుతుందని, తన వెంటే ఎప్పుడూ ఉండే క్యారెక్టర్ పవన్ దని తెలిపాడు. మూవీలో గంట 50 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.మూవీలో తనకు ఒక డ్యూయెట్, పవన్ తో కలిసి మరో పాట ఉంటుందని, మిగిలిన రెండు సాంగ్స్ మాంటేజ్ తరహా  పాటలని తెలిపాడు. పవన్ నటించింది దేవుడి పాత్రే కానీ గోపాల గోపాల సినిమాలో ఉన్నట్టు సీరియస్ గా ఉండదని, ఎంటర్టైనింగ్ గా, ఫ్యాన్స్ కు నచ్చేలా సముద్రఖని, త్రివిక్రమ్ తీర్చిదిద్దారని చెప్పాడు. పవన్ చాలా సరదాగా ఈ క్యారెక్టర్ ను చేశారని, ఇద్దరి మధ్య ఉండే బంధం ఈ మూవీకి హైలైట్ అని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.

Also Read: ప్రభాస్ “కల్కి 2898 AD” లో ఉన్న సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… ఆ సినిమాల నుండి కాపీ కొట్టారా..?

 


End of Article

You may also like