ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’ ని ఇండియన్ హాలీవుడ్ సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ K అని వర్కింగ్ టైటిల్ తో మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని దాదాపుగా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నఈ మూవీలో సూపర్ హీరోగా ప్రభాస్ నటించబోతునట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

Video Advertisement

‘కామిక్ కాన్’ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్ గ్లింప్స్ కి నెట్టింట్లో అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే మరో వైపు రెండు హాలీవుడ్ సినిమాలను కలిపి తీసినట్టు ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
project-k-first-glimpseప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ‘కల్కి 2898 AD’ మూవీలో కమల హాసన్, అమితాబ్ బచ్చన్, దిశాపటాని కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తుండగా, నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
Prabhas-Project-K-First-Lookఈ మూవీ భారతీయ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. ఈ గ్లింప్స్ తో ఆ విషయాన్ని మర్చిపోయేలా చేశారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అయితే కొందరు నెటిజెన్లు మాత్రం ఈ గ్లింప్స్ ని 2 హాలీవుడ్ సినిమాలని కలిపి తీసినట్టుగా ఉందని అంటున్నారు. హాలీవుడ్ సినిమాలు డూన్, స్టార్ వార్స్ ని కలిపి తీసినట్టుగా ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక బీజీఎం ఐతే అదే సంతోష్ నారాయణ్ కాబట్టి ‘దసరా’ సినిమా బీజీఎం విన్నట్టుగా ఉందని అంటున్నారు.

Also Read: ప్రభాస్‌ “కల్కి 2898 AD” గ్లింప్స్‌ లో కనిపించిన… ఈ నటుడు ఎవరో తెలుసా..?